అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన గౌరవ మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీ వెన్ రెడ్డి రాజు

Share this:

చౌటుప్పల పట్టణం మున్సిపల్ పరిధిలోని మున్సిపల్ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీ వెన్ రెడ్డి రాజు సంధ్య గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో 500 మందికి పైగా మహిళలు పాల్గొన్నారు. గౌరవ మున్సిపల్ చైర్ పర్సన్ గారు మాట్లాడుతూ..ప్రస్తుతం మహిళలు ఎలా ఎదగాలి వారి ఆలోచనా విధానాలు వారి పట్ల జరుగుతున్న అన్యాయాలు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు మహిళలకు సమాన హక్కు కల్పించడం జరిగింది. మహిళలకు ధైర్యంగా షిటీం ఏర్పాటు చేయడం జరిగినది. స్త్రీలు ప్రతి విషయంలో పోటీ పడుతూ కుటుంబంలో తనవంతుగా కుటుంబ బాధ్యతలు తీసుకొని వాళ్ల పిల్లలకి భవిష్యత్తు తరాలకు ఉపయోగపడే విధంగా పెంచాలని, అన్నీ రంగాల్లో మహిళల ప్రోత్సాహం ఉండేవిధంగా ఎదగాలి అని అన్నారు. స్త్రీ లేకుంటే మానవ జన్మ లేదు. ప్రతి ఒక్కరూ స్త్రీని గౌరవించాలి అని అన్నారు.మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలను శాలువాలతో సన్మానించారు వారికి షీల్డ్ బహిష్కరించడం జరిగినది🙏

ఈ కార్యక్రమంలో గౌరవ మున్సిపల్ కమీషనర్ శ్రీ. కె నరసింహారెడ్డి, Ci శ్రీనివాస్, సింగిల్విండో చైర్మన్ చింతల దామోదర్ రెడ్డి, కౌన్సిలర్ MD బాబా షరీఫ్, కొరగొని లింగస్వామి, తాడూరి శిరీష పరమేష్, పొలోజు శ్రీధర్ బాబు, తెలంగాణ గానకోకిల అమల, సారంగా దరియా సాంగ్ రాసిన సింగర్ కోమలి, కళాకారుని యాట సంధ్య, డాక్టర్ శ్వేత ప్రియాంక , వివిధ శాఖల్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులు, ఆశావర్కర్లు, తదితరులు పాల్గొన్నారు..

Leave a Reply