అందాపూర్ లో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్

Share this:

చట్టాలపై అవగాహన కార్యక్రమంలో భాగంగా నేడు రంగారెడ్డి జిల్లా, మొయినాబాద్ మండల్, అందాపూర్ గ్రామంలో రాజేంద్రనగర్ మండల న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజేంద్రనగర్ కోర్టుల న్యాయమూర్తులు 14వ న్యాయమూర్తి మరియు మండల్ న్యాయ సేవ అధికారి సంస్థ చైర్మన్ శ్రీమతి ఇ రుబీనా ఫాతిమా, 16వ న్యాయమూర్తి శ్రీమతి సుచరిత గారు మాట్లాడుతూ మహిళల హక్కులు మరియు చట్టాలపై అవగాహన కల్పించారు. వరకట్న నిషేధ చట్టం, బాలికల హక్కులు, శ్రామిక చట్టాలు విద్యా హక్కు చట్టాలపై అవగాహన కల్పించారు. అందాపూర్ సర్పంచ్ రవళి మాట్లాడుతూ గ్రామాలలో బెల్టుషాపులను తొలగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాజేంద్రనగర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీ శ్రీ పాండు రంగ రెడ్డి, కార్యదర్శి సుదర్శన్, సి ఐ రాజు, లీగల్ కాన్సిల్ జ్ఞానేశ్వర్ చారి, గ్రామ సర్పంచ్ బి రవళి గోపి కృష్ణ రెడ్డి, ఉపసర్పంచ్ నాగార్జున చారి, ఎంపీటీసీ రవీందర్ రెడ్డి, న్యాయవాదులు కోళ్ల ప్రవీణ్ కుమార్ , కోరుకొండ కిరణ్ కుమార్ , ప్యానెల్ లాయర్లు కుమార్ , సుధాకర్ ఆర్ రెడ్డి , శ్రీధర్ రెడ్డి, రాజబాబు, బందయ్య, కోర్టు సిబ్బంది నరేష్, యాదగిరి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Leave a Reply