అఖిల భారత రైతు కూలి సంగం ఆద్వర్యంలో రైతు విద్రోహ దినం

Share this:

నిర్మల్ జిల్లా బై0సా పట్టణం లోనివిశ్రాంతిభవనంలోసోమవారం రైతు విద్రోహ దినం ఘనంగా నిర్వహించారు.ఈ సమావేశంలో ఏ.ఐ.కె.ఎం. ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జే. రాజుమాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వం రైతాంగ సమస్యల్ని పరిష్కరిస్తామని చెప్పి,సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్.కె.ఎం)కు ఇచ్చిన హమిలైన రైతుల మీద వాహనాన్ని ఎక్కించి చంపిన ఘటనలో కేంద్ర మంత్రిని అలాగేకొనసాగించడం,ఎం.ఎస్.పి కి కమిటీ నియమించడం,రైతులపై పెట్టిన కేసులను వెనక్కి తీసుకోవడం,ఉద్యమంలో అమరులైన రైతులకు నష్టపరిహారం చెల్లించడం తదితర హామీలలో ఏ ఒక్క హామీని అమలు చేయక పోవడం రైతాంగ విద్రోహమని విమర్శించారు.కనీస మద్దతు ధరకు చట్టాన్ని వెంటనే తేవాలని డిమాండ్ చేశారు. రైతాంగ సమస్యలు పరిష్కరించేంత వరకు రైతాంగం అన్నివర్గాల ప్రజలు సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు .ఈ సమావేశంలో జిల్లా నాయకులు ముత్తన్న,సాజిద్, గంగాధర్, దీనజి,ప్రసాద్,పోతన్న,దమ్మపల్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply