అగాపే ఇంటర్ ఫెయిత్ మినిస్ట్రీస్ తరపున పేదలకు దుప్పట్లు

Share this:

జనగామ ఫిబ్రవరి 5:జనగామ అగాపే ఇంటర్ ఫెయిత్ మినిస్ట్రీస్ తరపున చలి తీవ్రత గురించి రాష్ట్రంలోని జనగామ,ఆసిఫాబాద్, కరీంనగర్ ,వరంగల్ హైదరాబాద్ , సిద్దిపేట జిల్లాలోని పలు ప్రాంతాల్లో 1000 మంది పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు.జిల్లాలోని వివిధ గ్రామాల్లో గల అనాధలకు , అభాగ్యులు, నిరుపేదలు, మూగ చెవిటి గుడ్డి హెచ్ఐవి /ఎయిడ్స్ వ్యాధి సోకిన చిన్నారులకు, గుడ్డి,కుష్టు రోగులు, వికలాంగులు, వృద్ధులకు అగాపే ఇంటర్ ఫెయిత్ మినిస్ట్రీస్ పౌండర్, డైరెక్టర్స్ కె.ఎం. జాన్,జయమణి జాన్ చేతుల మీదుగా అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ పంపిణీ కార్యక్రమంలో భాగంగా శనివారం దయా నిలయం హాస్టల్లో ప్రాంగణంలో జనగామ కు చెందిన వికలాంగులకు ఈరోజు 40 మందికి దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జనగామ ప్రెస్టన్ కాలేజ్ ప్రిన్సిపల్పి .ఎజ్రా శాస్త్రి, దయనీయం హాస్టల్ ఆఫీస్ మేనేజర్ మందాడి మంజుల,అగాపే స్కూల్ హెడ్ మాస్టర్ తాటి రాజు, తెలంగాణ వికలాంగుల వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు మేకల సమ్మయ్య, బోట్ల సుమతి , వాతాల యాదగిరి, ఎండి రషీద్ , షర్మిల ,వెన్నెల, పవన్, గ్రేస్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply