అటవీ శాఖ అధికారుల దాడులు వెంటనే ఆపాలి -కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో

Share this:

గంగారం(V3News): మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పుట్టల భూపతి గ్రామంలో సొలం బాబురావు అనే గిరిజన రైతును శుక్రవారం రాత్రి పొలం దగ్గర కాపలాగా ఉండగా అటవీశాఖ అధికారులు ఆయన చితకబాదారుని. అందుకు కారకులైన అటవీ శాఖ అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు . సంఘటనపై మండల పార్టీ అధ్యక్షుడు వజ్జ సారయ్య మాట్లాడుతూ రాత్రి దొంగచాటున ట్రెంచ్ కొట్టడం కోసం వచ్చారని తాను గ్రామస్తులకు తెలియజేస్తారని ఉద్దేశంతో . తన అదుపులో తీసుకొని కార్యాలయానికి తరలించారు అక్కడ ఆయనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు ఆయన అస్వస్థతకు గురికావడం తో గొంతు ఆర్క పోతుంది కొన్ని నీళ్ళు ఇవ్వండని బ్రతిమలాడి గా DRO కర్ణ నాయక్ కాలి బాటిల్ లో మూత్రం పోసి తాగితే తాగు లేకపోతే చచ్చిపో మీ భార్య వెధవ రాలు అవుతుందని నోటికొచ్చినట్లు తిట్టారు పూర్తిగా అస్వస్థతకు గురికావడంతో అర్ధరాత్రి ఎవరు లేని సమయంలో ఇంటి వద్దకు వచ్చి వదిలేసి వెళ్లిపోయారు కాళ్ళ మించి కొట్టడంతో కాళ్లు పనికి రాకుండా అయ్యాయని అన్నారు

అటవీశాఖ అధికారులు కావాలని దాడులు చేస్తున్నారని ట్రీంచ్ పనులను ఆపకపోతే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపడతామని ఆయన హెచ్చరించారు ఈ కార్యక్రమంలో గంగారం జడ్పిటిసి. ఈ సం రమా సురేష్ ఎంపీపీ. సువర్ణ పాక సరోజన జగ్గారావు . వైస్ ఎంపీపీ . ముడిగె సుభద్ర పోతయ్య. కొత్తగూడ మండలం . ఎంపీపీ విజయ రూప్ సింగ్. చల్ల నారాయణ రెడ్డి కొఆప్షన్ ఎండి సయ్యద్. బిట్ల శీను రాళ్ళబండి ప్రవీణ్.తదితరులు పాల్గొన్నారు

Leave a Reply