అట్టహాసంగా సుజనహిత చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో నూతన సంవత్సర వేడుకలు…చైర్మన్ బండారి శేఖర్ గౌడ్ వెల్లడి

Share this:

హన్మకొండ అంబేద్కర్ భవన్ ఎదురుగా గల సుజనహిత చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ప్రధాన కార్యాలయంలో సుజన హిత చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఛైర్మన్ బండారి శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో 2022 నూతన సంవత్సర వేడుకలను శనివారం అట్టహాసంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఛైర్మన్ బండారి శేఖర్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ మా చిట్ ఫండ్స్ స్థాపించినప్పటి నుండి మా వెన్నంటే ఉన్న మా ఖాతాదారులకు,ప్రమోటర్ మిత్రులకు, శ్రేయోభిలాషులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.మా చిట్ ఫండ్స్ ప్రస్తుతం రెండు కోట్ల టర్నోవర్ సాధించిందని తెలిపారు.చిట్ ఫండ్స్ ను ఎలాగైతే ఆదరించారో సుజనహిత డెవలపర్స్ ను అలాగే ఆదరించాలని కోరారు.అనంతరం నూతన సంవత్సరం సందర్భంగా భారీ కేక్ కట్ చేశారు.ఈ కార్యక్రమంలో చిట్ ఫండ్స్ మేనేజింగ్ డైరెక్టర్ గుడిపాటి జనార్ధన్,సుజనహిత డెవలపర్స్ సీఈఓ నాగపురి రాంచందర్,డైరెక్టర్ లయన్ చిర్ర ఉపేందర్,ప్రమోటర్ మిత్రులు,సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply