అట్టహాసంగా స్కిల్ స్టోక్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రథమ వార్షికోత్సవం- హాజరైన ఎర్రబెల్లి,బోయినపల్లి,దాస్యం

Share this:

హన్మకొండ(V3News): విద్యార్థులకు ఉపాద్యాయులు మంచి అలవాట్లను పెంపొందించి,నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేయాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు సూచించారు. హన్మకొండ భీమారం లోని SVS విద్యాసంస్థల ఆవరణలోని స్కిల్ స్టోక్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రథమ వార్షికోత్సవం శనివారం రాత్రి అట్టహాసంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు,రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ హాజరయ్యారు.ఈ సందర్భంగా అతిధులు మాట్లాడుతూ స్కిల్ స్టోక్ ఇంటర్నేషనల్ స్కూల్ మేనేజింగ్ డైరెక్టర్ ఎర్రబెల్లి అనూప్ దంపతులు వరంగల్ జిల్లాలోని విద్యార్థులకు ఇంటర్నేషనల్ స్థాయిలో నాణ్యమైన విద్య నందించేందుకు కృషి చేయడం చాలా గొప్ప విషయమన్నారు. అనంతరం అంతర్జాతీయ నృత్య కళాకారిణి దీపికా రెడ్డి నృత్య ప్రదర్శన,విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు తల్లిదండ్రులను,ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకున్నాయి.ఈ కార్యక్రమంలో SVS విద్యాసంస్థల చైర్మన్ ఎర్రబెల్లి తిరుమల్ రావు,వైస్ ఛైర్మన్ ఎర్రబెల్లి సువర్ణ,ఉపాద్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు,పాఠశాల సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply