అదిలాబాద్ జిల్లా నియోజకవర్గం సిరికొండ మండలం మారుమూల గ్రామీణ ప్రాంత యువతుల [మహిళల]కు స్వచ్ఛంద సంస్థ కుచ్చు టోపీ

Share this:

అదిలాబాద్ జిల్లా నియోజకవర్గం సిరికొండ మండలం ఎంతోకొంత చదువుకొని ఉపాధి లేక సతమతమవుతున్న మారుమూల గ్రామీణ ప్రాంత యువతుల [మహిళల]కు ఓ స్వచ్ఛంద సంస్థ కుచ్చు టోపీపెట్టింది. తమకు ఉపాధి కల్పిస్తాం స్వయం ఉపాధితో మిమ్మల్ని మంచి ఉన్నతులుగా తీర్చిదిద్దుతాం… స్వయం ఉపాధి స్థాపనకు ఆర్థిక సహాయం అందిస్తామంటూ మాయమాటలు చెప్పి వందలాది మంది యువతులకు గాలం వేసి పెద్ద మొత్తంలో వసూలు చేసి ఘరానా మోసం చేసి ఉడాయించిన ఓ సంస్థ నిర్వాకం జిల్లా లోని మారుమూల సిరికొండ మండలం లో వెలుగు చూసింది . ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘరానా మోసం సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి…. మోసపోయిన బాధితుల కథనం ప్రకారం మారుమూల నూతన మండలమైన సిరికొండ మండలంలోని మారుమూల గిరిజన గ్రామాలైన చిన్న గోధుమల్లే/ నేరడిగొండ జి/ నారాయణ పూర్ గ్రామాల్లో చదువుకున్న కొందరు ఆదివాసీ గిరిజన యువతులకు ఉపాధి లేక వ్యవసాయ పనులకు ఇతర పనులకు వెళుతూ తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉంటున్నారు….. ఉపాధి కోసం ఎదురు చూస్తున్న విషయం గమనించిన ఓ స్వచ్ఛంద సంస్థ వారికి గాలం వేసింది.. మాయమాటలు చెప్పి వారిని బోల్తా కొట్టించారు… “”అభి శ్రీ ఫౌండేషన్”””అనే నిర్వాహకులైన ఓ ముగ్గురు వ్యక్తులు గత ఏడాది గ్రామంలోనే తిష్ట వేసి… .ఉపాధి లేక కూలి పనులు చేస్తూ కాలం వెళ్లదీస్తున్నారు అని గమనించి ఒక మంచి స్వయం ఉపాధి కల్పిస్తామని, కుట్టు మిషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి… స్వయం ఉపాధిని కల్పిస్తామని, మొదట మూడు నెలలు ఉచితంగా శిక్షణ ఇస్తామని, ప్రతి ఒక్కరికి విలువైన కుట్టు మిషన్… ఉచితంగా అందించి జీవనోపాధి కల్పిస్తామని, మాయమాటలు చెప్పి దాదాపు ఈ ప్రాంతంలో రెండు వందల మంది గిరిజన యువతను నమ్మించారు. ప్రవేశం పొందడానికి రూపాయలు పదిహేను వందల రూపాయలు చెల్లించాలని చెల్లించిన… వారికి ఉచిత శిక్షణతో పాటు శిక్షణ అనంతరం ప్రభుత్వం చే గుర్తించబడిన శిక్షణ పత్రం, కుట్టుమిషన్ అందించడం జరుగుతుందని నమ్మబలికారు. దీంతో ఆశపడి తమకు ఉపాధి ఉపాధి తో పాటు కుట్టు మిషన్ కూడా ఉచితంగా వస్తుందని ఆశతో వారికి 1500 రూపాయలు చొప్పున వారికి చెల్లించారు. మూడు రోజుల పాటు అందరికీ దగ్గర డబ్బులు దాదాపు మూడు లక్షల రూపాయల వరకు వసూలు చేసి ఉంచారు….డబ్బులు వారికి చేరాక…. రేపు మాపు అంటూ, వారం పక్షం రోజుల్లో శిక్షణ కేంద్రాన్ని ప్రారంభిస్తామని… చెబుతూ వచ్చిన ఆ నిర్వాహకులు బుకాయించి గత ఆరు నెలలుగా పత్తా లేకుండా పారిపోయారు. ఎక్కడ వెతికిన కనిపించడం లేదని కనీసం ఫోన్ కూడా పనిచేయడం లేదని తాము మోసపోయామని గ్రామాల్లో వెళ్ళిన విలేకరులకు తమ ఆవేదనను వ్యక్తం చేశారు….. తమను నమ్మించి మోసం చేశారని అన్నారు.. ఇద్దరూ యువకులు ఒక యువతి వచ్చి మాయమాటలు చెప్పి నమ్మించారు అని ఇచ్చోడ మండలానికి చెందిన యువతి హైదరాబాద్ నుంచి చి మరో ఇద్దరు యువకులను తీసుకు వచ్చి మా పెద్ద సార్లు అని పరిచయం చేయించి అందరి వద్ద డబ్బులు వసూలు అయ్యేవరకు తిష్ట వేసి పారిపోయారని అన్నారు. తాము కూలి నాలి చేసి అప్పులు చేసి వారికి చెల్లించామని తమను మోసం చేస్తారని ఊహించలేదని వాపోయారు .ఇకనైనా అధికారులు పోలీసులు ఈ సంఘటనపై విచారణ జరిపి దోషులను పట్టుకొని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా… వారిని శిక్షించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

Leave a Reply