అనంత జిల్లాలో జనసేన పార్టీలో పలువురి చేరిక

Share this:

కదిరి(V3News): అనంతపురం జిల్లా కదిరి పట్టణంలోని ఎస్ వి కే కళ్యాణమండపం నందు కార్యకర్తల సమావేశం జరిగింది. ఇందులో భాగంగా ఇంచార్జ్ భైరవ ప్రసాద్ అద్యక్షన దాదాపు 30 మంది మహబూబ్ బాషా ఆధ్వర్యంలో పార్టీలో చేరడం జరిగింది వీరిని జిల్లా అధ్యక్షులు టిసి వరుణ్ కండువా కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ సిద్ధాంతాలు పవన్ కళ్యాణ్ పై ఉన్న అభిమానంతో పవన్ కళ్యాణ్ పెట్టిన 5 సిద్ధాంతాలు ఆయన చేస్తున్న పోరాటం నచ్చి ఈ రోజు మేము పార్టీలో చేరుతున్నట్లు వారు తెలిపారు.పవన్ రావాలి పాలన మారాలి ఆన్న సిద్ధాంతంతో పని చేస్తామని వారు పేర్కొన్నారు. నిన్నటి దినం జనసేన పార్టీ ఇంచార్జ్ భైరవ ప్రసాద్ ఆదేశాల మేరకు నేడు కార్యకర్తలు భారీ ఎత్తున తరలివచ్చి ఈ సమావేశానికి హాజరయ్యారు.ఈసందర్భంగానే జిల్లా అధ్యక్షులు మరియు ఇంచార్జీ వారు మాట్లాడుతూ పార్టీ క్రియాశీలక సభ్యత్వం మండల కమిటీల బలోపేతం చేయడం పైన వారు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు ఈశ్వర్,ప్రధాన కార్యదర్శి కుమ్మర నాగేంద్ర మండల కన్వీనర్ లు,చలపతి, మహేష్, రమణ, చౌదరి, రవీంద్ర నాయక్,అనురాధ, లక్ష్మి, లక్ష్మణ్, శ్రీనివాసులు, చక్క రమణ, గణేష్, నాగేంద్ర, రెడ్డి,వంశీ, భాస్కర్, రవి తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply