అమ్మయ్యప్పర్ వస్త్ర ఉత్పత్తి పరిశ్రమ శంకుస్థాపన

Share this:

నగరి v3 న్యూస్ రిపోర్టర్: చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం నిండ్ర మండలం ఎమ్.ఎస్.వి.ఎం పురం గ్రామంలో నగరి నియోజకవర్గం గౌరవ శాసన సభ్యురాలు, ఏపీఐఐసీ చైర్మన్ ఎమ్మెల్యేశ్రీమతి ఆర్.కె.రోజా, సెల్వమణి దంపతులు అమ్మయ్యప్పర్ వస్త్ర ఉత్పత్తి పరిశ్రమకు బుధవారం శంకుస్థాపన చేశారు. సంస్థ నిర్వాహకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ వై.యస్.జగన్మోహన్ రెడ్డి గారు వాతావరణ కాలుష్యం కలిగించని పరిశ్రమలను ప్రోత్సహించడానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారని నగరి శాసనసభ్యురాలు శ్రీమతి ఆర్.కె.రోజా గారు తెలిపారు. నగరి నియోజవర్గం నుంచి వేలాది మంది తమిళనాడు, కర్ణాటక ప్రాంతాలకు ఉపాధి కోసం వెళ్తున్నారని, మన గ్రామాలలోనే పరిశ్రమలు ఏర్పాటు చేస్తే నిరుద్యోగులకు ఒక భరోసా కలుగుతుందని అన్నారు

అమ్మయప్పర్ కంపెనీకి మంచి పేరు ఉందని 20వేలమంది పనిచేస్తున్నారని తెలిపారు. నియోజక వర్గంలో మూడువేలమందికి ఉపాధి కల్పించేందుకు వస్త్ర ఉత్పత్తి పరిశ్రమ ప్రారంభించడానికి ముందుకు రావడం పట్ల కృతజ్ఞతలు తెలిపారుఈ కార్యక్రమంలో అమ్మయప్పర్ టెక్స్ టైల్స్ చైర్మన్ శ్రీ కార్తిక్, వైయస్సార్ సిపి నాయకులు శ్యామ్ లాల్, భాస్కర్ రెడ్డి, వేణుగోపాల రాజు, సుబ్రమణ్యం రాజు, దేవదాసు, దీపా, నాగభూషణ్ రాజు, మునికృష్ణా రెడ్డీ, అనిల్, మేరీ, రామచంద్ర, సంపత్,నామదేవ్, దశరథ నాయుడు, ప్రభాకర్ నాయుడు, దయాల్,దామోదరం,గిరి, సర్పంచులు సంద్య, ఆదిలక్ష్మి, ఎంపీడీవో సతీష్ ,
ఎమ్మార్వో ప్రసన్న కుమార్, ఇతరులు పాల్గొన్నారు

Leave a Reply