అసమానతలను అంతం చేద్దాం- ఎయిడ్స్ ని రూపు మాపుదం – శ్రీ. ఎన్. నర్సింగరావు, ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జ్.

Share this:

ఎయిడ్స్ నివారణకి అవగాహన, పరీక్షలే నియంత్రణ మార్గాలు – డాక్టర్ కే. లలితాదేవి, జిల్లా వైద్య & ఆరోగ్యశాఖధికారి.

నేడు ప్రపంచ ఎయిడ్స్ దినోత్చవ సంధర్భంగా జిల్లా ఎయిడ్స్ కంట్రోల్ సొసైటి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, హనుమకొండ వారి అధ్వర్యంలో ఎయిడ్స్ అవగాహన ర్యాలీ మరియు అవగాహన సదస్సుని ఘనంగా నిర్వహించడం జరిగినది. ఎన్‌ఐటి , వరంగల్ నందు ముఖ్య అతిధి గౌరవనీయులు శ్రీ. ఎన్. నర్సింగరావు, ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జ్, శ్రీమతి సంధ్య రాణి, అడిష్ నల్ కలెక్టర్, డాక్టర్ కే. లలితాదేవి, డి‌ఎం‌హెచ్‌ఓ, శ్రీ. మహేశ్ నాథ్, సెక్రటరీ లీగల్ సర్వీసెస్ అథారిటీ ముఖ్య అతిధులుగా పాల్గొని జెండా ఊపి ర్యాలీని ప్రాంరంభించినారు.
ఈ ర్యాలీలో బ్యానర్లు, ప్లా కార్డ్ ల ప్రదర్శనలతో, నినాదాలతో మరియు కళా బృందాల సందేశాత్మక పాటలతో ఎన్‌ఐటిన, వరంగల్ నుండి కొనసాగుతూ ఆర్ట్స్ & సైన్స్ కాలేజీ, ఆడిటోరియం కు చేరుకున్నది.
తదనంతరం ఆర్ట్స్ & సైన్స్ కాలేజీ, ఆడిటోరియం నందు అవగాహన సదస్సులో భాగంగా ముందుగా డాక్టర్. మదన్ మోహన్ రావు, అదనపు జిల్లా వైద్య అధికారి (లేప్రాసి మరియు ఎయిడ్స్ ) గారు స్వాగత ఉపన్యాసం చేస్తూ జిల్లాలో జరుగుతున్న కార్యక్రమాల వార్షిక నివేధికను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా తెలియచేశారు.

తరువాత ప్రతిజ్ఞ చేయించడం జరిగినది. తదనంతరం ముఖ్య అతిధులు ప్రసంగిస్తూ నంది కొండ నర్సింగరావు గారు మాట్లాడుతూ సమాజం లో ఎయిడ్స్ పైన ఉన్న అపోహలని తొలగిస్తూ అవగాహన ని పెంచుతూ, ఎలాంటి అసమానతలు లేకుండా ఎయిడ్స్ వ్యాధిని అంతం చేయాలని ఎయిడ్స్ వ్యాధిని పూర్తిగా రూపు మాపాలని, రోగిని కాదు రోగాన్ని దూరం చేయాలని తెలియ చేశారు. మరొక ముఖ్య అతిధి శ్రీ. మహేశ్ నాథ్, సెక్రటరీ లీగల్ సర్వీసెస్ అథారిటీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కూడా ఎయిడ్స్ నియంత్రణ లో ముందస్తు జాగ్రత చర్యలు మరియు అందుబాటులో గల చట్టాల పై అవగాహన కలిగి ఉండాలని మానవ హక్కుల ఉల్లంఘన జరుగకుండా ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల పై చిన్న చూపు కలిగిఉండకుండా సమ భావాన్ని కలిగి ఉండాలని సూచించారు. డాక్టర్. కె. లలితా దేవి, డి‌ఎం‌హెచ్‌ఓ గారు మాట్లాడుతూ హెచ్‌ఐవిు నాలుగు విధాలుగా మాత్రమే సోకుతుందని అవి అసురక్షిత లైంగిక సంభంధల ద్వారా, కలుషితమైన సూధులు, సూరంజీల ద్వారా, కలుషితమైన రక్తాన్ని మరొకరికి ఎక్కించడం ద్వారా మరియు హెచ్‌ఐవి్ సోకిన తల్లి నుండి పుట్ట బోయే బిడ్డకు హెచ్‌ఐవి సోకుతుందని కావున ప్రతి ఘర్భిణి స్త్రీకి సాదారణ పరీక్షలతో పాటు హెచ్‌ఐవి ఎయిడ్స్ టెస్ట్ తప్పనిసరి చేయించాలని, లైంగిక వ్యాధుల నియంత్రణలో భాగంగా ప్రతి గురువారం అడల్ట్ ఫ్రీoడ్లీ క్లినిక్స్, మొబైల్ హెల్త్ క్లినిక్స్ మరియు కౌమార దశలో గల బాల, బాలికలకీ ఔట్ రీచ్ క్యాంప్స్ నిర్వహించాలని సూచించారు. తదనంతరం డాక్టర్. చంద్ర శేఖర్, సూపరింటెండెంట్ ఎం‌జి‌ఎం డాక్టర్. బాలాజి ప్రెసిడెంట్ ఐ‌ఎం‌ఏ, డాక్టర్. మోహన్ దాస్, ప్రిన్సిపల్ కే‌ఎం‌సి, తదనంతరం హెచ్‌ఐవిజ/ఎయిడ్స్ సేవలు అంద చేయుచున్న వారికి ప్రశంస పత్రములు ముఖ్య అతిధుల ద్వారా పంపిణీ చేయడం జరిగినది. వందన సమర్పణతో కార్యక్రమం ముగిసినది. సందర్శకుల కోసం అవగాహన్ స్టాల్ ని డాక్టర్ కే. లలితాదేవి గారు ప్రత్యేకంగా పరిశీలన చేయడం జరిగినది.

Leave a Reply