ఆత్మకూరు ఎస్ మండలం అస్లా తండా, మిడతనపల్లి గ్రామాల్లో ఖాళీ అయిన విపక్ష పార్టీ లు

Share this:

అభివృద్ధికి ఆకర్షితులై టి.ఆర్.ఎస్ లో చేరిన 132 మంది కాంగ్రెస్, బిజెపి నేతలు, కార్యకర్తలు

గులాబీ జెండాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి జగదీష్ రెడ్డి.

ఆత్మకూర్ ఎస్ (V3News) 14-07-2022: గులాబీ జెండాయే అందరికి అండ అని,ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వమే మనందరికీ శ్రీరామ రక్ష అని ప్రజలంతా నమ్ముతున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. ఆత్మకూర్ ఎస్ మండలం అస్లా తండా, మిడతనపల్లి గ్రామాల కు చెందిన సుమారు 132 మంది కాంగ్రెస్, బిజెపి లకు చెందిన నాయకులు, కార్యకర్తలు మంత్రి జగదీశ్ రెడ్డి సమక్షంలో లో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ లొకి వచ్చిన నేతలకు గులాబీ కండువాలు కప్పి మంత్రి జగదీశ్ రెడ్డి సాదర స్వాగతం పలికారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ గత ఎనిమిదేండ్లుగా రాజకీయాలకతీతంగా జరుగుతున్న అభివృద్ధికి ఆకర్షితులై ఇతర పార్టీల ను వీడి టీ.ఆర్.ఎస్ లో చేరడం అభినందనీయమని అన్నారు. సూర్యాపేటతో పాటు ఉమ్మడి జిల్లాలో గత ఎనిమిదేళ్లుగా కొనసాగుతున్న అభివృద్ధికి ఇతర పార్టీల నుంచి ఆగకుండా వలసలు కొనసాగుతున్నాయన్నారు. ఇప్పటికే విపక్షాలు ఖాళీ అయ్యే పరిస్థితి ఏర్పడిందని.. ఇంకా ఆయపార్టీలలో కొనసాగుతున్న నాయకులు సైతం వుండబట్టలేక స్వచ్చందంగా తరలి రావడం అభినందనీయమన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రంలోని అన్ని రంగాల్లో అభివృద్ధి దూసుకుపోతున్నదని చెప్పారు. తెలంగాణ వస్తే భూముల ధరలు పడిపోతాయని, కరెంట్ లేక అంధకారంగా మారుతుందని ప్రచారం చేశారని కానీ నేడు తెలంగాణ 24 గంటల నిరంతర విద్యుత్ వెలుగులతో విరాజిల్లుతున్నదన్నారు. వ్యవసాయరంగానికి 24గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తమదేనన్నారు. రెండు గ్రామాల నుండి కాంగ్రెస్, బిజెపి లకు కు చెందిన నేతలు వాంకుడోతు భీమా, కరుణాకర్, హార్య, సామ లక్ష్మారెడ్డి, జ్ఞాన సుందర్, వంటి నేతలతో పాటు వారి అనుచరులు , కుటుంబసభ్యులు టీ.ఆర్.ఎస్ లో చేరారు.. జడ్పీ వైస్ ఛైర్మన్ గోపగాని వెంకట్ నారాయణ గౌడ్ ఆధ్వర్యం లో జరిగిన ఈ కార్యక్రమం లో ఎంపిపి మర్ల చంద్రారెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు తూడి నర్సింహారావు, సింగిల్ విండో ఛైర్మెన్ కోనతం సత్యనారాయణ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి బోలెద్దు జానయ్య తదితరుల పాల్గొన్నారు..

Leave a Reply