ఆదివాసి సేన తెలంగాణ రాష్ట్ర కమిటీ విస్తృత స్థాయి సమావేశం

Share this:

ములుగు జిల్లా ఏటూరునాగారం: ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసుల ఆత్మ గౌరవం నిలిపే పెసా చట్టం అమలు ద్వారా స్వయం పాలన సాధనకై ఉద్యమించాలని ఆదివాసి సేన తెలంగాణ రాష్ట్ర ఆధ్యక్షులు కోవ దౌలత్ రావు మోకాశి పిలుపునిచ్చారు.
ఏటూరునాగారం కేంద్రంలో ఆదివాసి సేన తెలంగాణ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం రాష్ట్ర కార్యదర్శి మడి సాయిబాబా అధ్యక్షతన ఆదివారం నాడు ఐటిడిఎ కేంద్రంలో నిర్వహించడం జరిగింది ఈ సమావేశం నందు ముఖ్య అతిథిగా, వక్తగా హాజరైన ఆదివాసి సేన తెలంగాణ రాష్ట్ర ఆధ్యక్షులు కోవ దౌలత్ రావు మోకాశి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 1996 సంవత్సరంలో షెడ్యూల్డ్ ఏరియాలో పెసా చట్టాన్ని ఆమలుకు పార్లమెంట్ ఆమోదిస్తే నేటికి 25 సంవత్సరాలు ఆవుతున్న నేటికి పూర్తి స్థాయిలో ఆమలుకు పార్లమెంట్ నోచుకోవడం లేదని విమర్శించారు. పెసా చట్టం పట్ల ప్రభుత్వ అధికారుల్లో అవగాహన లేక పోవటం దుర్మార్గమని అన్నారు. 5వ షెడ్యూల్డ్ ప్రాంతంలో ఆదివాసులకు హక్కులు కల్పించాల్సిందిగా భరత రాజ్యంగం చెబుతుంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ సహజ వనరులను దోచుకోవడానికి కాంట్రాక్టర్లు/ గిరిజనేతరులకు, ఆధికార పార్టీ నేతలకు బార్ల తెరచి అవకాశాలు కల్పిస్తుందని విమర్శించారు. పెసా చట్టం అమలు జరిగితే ఆదివాసులు తమ ఆత్మ గౌరవాన్ని స్వయం పాలన ద్వారా మాత్రమే సాధించుకోవచ్చని తెలిపారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసి సమాజ ఉద్యమాలు తలొగ్గి పోడు భూములకు హక్కు పత్రాలు కల్పిస్తుందని అందులో ఉమ్మడి సాముహిక హక్కు పత్రాలు ఇవ్వక పోవటం సరైనది కాదని, ఉమ్మడి హక్కుల సాధనకు ఉధ్యమాలే ఏకైక మార్గమాని పిలుపునిచ్చారు.
తోలుత సమావేశ ప్రారంభం ముందు సంఘ వ్వవస్థక ఆధ్యక్షులు కణితి లక్ష్మణరావు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మాడి రామచందర్ చిత్ర పాటలకు పూలమాలలు వేసి సంతాపం ప్రకటించారు.
ఈ సమావేశం ఆదివాసి సేన రాష్ట్ర ఉపాధ్యక్షులు గుండు శరత్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మడి సాయిబాబా, ఆదివాసి మహిళ సేన రాష్ట్ర ఆధ్యక్షురాలు చింత ఆరుణ, రాష్ట్ర ఉపాధ్యక్షులు సోడే వెంకటేష్ (హైదరాబాద్), కొమురం ఆనిల్, ఉయిక రవి, సోడే శ్రీను, వజ్జ జ్యోతి బాసు (భద్రాద్రి కొత్తగూడెం జిల్లా)
వాసం లింగయ్య, పోలిభోయిన ఆదినారాయణ, మంకిడి శ్రీను, బాస్కర్,చింత రవి (ములుగు జిల్లా) రాయిసిడం జంగు (ఆదిలాబాద్) కల్తి నరేష్ (మహబూబాబాద్) ముక్తి సాంబశివరావు (ఖమ్మం) విద్యార్థి, మహిళ, ఉద్యోగ ప్రతినిధులు హజరై పలు అంశాలపై చర్చించి ప్రసంగించారు.ఈ సందర్భంగా పలు అంశాలపై తీర్మానాలు చేశారు.

Leave a Reply