ఆర్యోగ తెలంగాణ రాష్ట్రమే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం- కోరుకంటి చందర్

Share this:

ఆర్యోగ తెలంగాణ రాష్ట్రమే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని…,రామగుండం ప్రజల చిరాకాలవాంచ నేరవేర్చి రామగుండానికి మెడికల్ కళాశాలప్రసాదించిన కేసీఆర్ రుణం ఏ సందర్భం వచ్చిన ప్రజలు తీర్చుకోవాలి అని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. సోమవారం గోదావరిఖని ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో నూతనంగా ఏర్పాటు కానున్న మెడికల్ కళాశాల పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ న్యాయకత్వంలో పేద ప్రజలకు ఉచితంగా వైద్యన్ని అందించాలన్న సంకల్పంతో ప్రతి జిల్లా కేంద్రాల్లో మెడికల్ కళాశాలను ఏర్పాటు చేసి రాష్ట్రాన్ని ఆరోగ్య తెలంగాణగా తీర్చిదిద్దడానికి అహర్నిషలు పాటుపడుతున్నరన్నారు. రామగుండం ప్రాంతంలో మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయాలని కేసీఆర్ కు విన్నవించడం జరిగిందని, రామగుండం ప్రాంత ప్రజలపై సిఎం కి ఉన్న అభిమానంతో మెడికల్ కళాశాల మాంజూరు చేశారన్నరు. మెదటగా 49 కోట్లతో మెడికల్ కళాశాల పనులు ప్రారంభమయ్యయన్నారు. మెడికల్ కళాశాల ఏర్పాటుతో ఈ ప్రాంత కార్పోరేట్ వైద్యం అందుబాటులోకి వస్తుందన్నారు. రోగులకు ఎలాంటి అత్యవసర పరిస్థితుల్లోనైనా వైద్యం అందుతుందన్నారు. రామగుండానికి మెడికల్ కళాశాల మాంజూరు చేసిన ఆరోగ్య ప్రధాత సిఎం కేసీఆర్ కి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రామగుండం నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు, కార్పోరేటర్లు కాల్వ స్వరూప-శ్రీనివాస్, కల్వచర్ల కృష్ణవేణి-భూమయ్య, దాతు శ్రీనివాస్, ఎన్వీ రమణరెడ్డి, కుమ్మరి శ్రీనివాస్, ఇంజపురి పులిందర్ బాల రాజ్ కుమార్, శంకర్ నాయక్, నాయకులు పాతపెల్లి ఎల్లయ్య, బోడ్డు రవీందర్, జే.వి.రాజు, కలువల సంజీవ్, గడ్డి కనుకయ్య, జహీద్ పాషా, తోడేటి శంకర్ గౌడ్, నూతి తిరుపతి, మోతుకు దేవరాజ్,అచ్చె వేణు, నారాయణదాసు మారుతి, గౌస్పోషా, చిలుముల విజయ్ కుమార్, నీరటి శ్రీనివాస్, నాగబూషణం, అల్లి గణేష్, ఇసంపల్లి తిరుపతి తదితరులుపాల్గొన్నారు.

Leave a Reply