ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసీ గిరిజన జాతర శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ జాతరాలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన* చిన్న జీయర్ స్వామి రాష్ట్రవ్యాప్తంగా ఆదివాసీ సంఘాల కు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి- ఆదివాసీ నాయకపోడు ములుగు జిల్లా అధ్యక్షులు కొత్త సురేందర్

Share this:

ములుగు(V3News): ములుగు జిల్లా కేంద్రంలో ములుగు గట్టమ్మ వద్ద ఆదివాసి నాయకపోడు జిల్లా అధ్యక్షుడు కొత్త సురేందర్ ఆధ్వర్యంలో సమావేశము ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో ఆదివాసీ నాయకులు జిల్లా అధ్యక్షులు కొత్త సురేందర్ మాట్లాడుతూ ఆసియా ఖండంలోనే అతిపెద్ద మహాజాతర అయినా శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను కించపరిచే విధంగా మాట్లాడారని అన్నారు. శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర విశిష్టత ఆదివాసులు ఆత్మ గౌరవం ,అలాంటి జతరపై నువ్వు ఏ విధంగా మాట్లాడారు అని జిల్లా అధ్యక్షులు కొత్త సురేందర్ అన్నారు. భారతదేశంలో గోండ్వాన పద్ధతిలో ఏర్పాటుచేసిన 18 శక్తి పీఠాలు గోండు రాజులు కనిపిస్తే వాటిని ఆక్రమించుకుని వాటిని వ్యాపార కేంద్రాలుగా మార్చుకొని చెమటలు చిందించకుండా అర్థం కాని భాషలో మంత్రాలు చదువుతూ నిలువుదోపిడీ చేసే నీకు మా ప్రకృతి దేవతలను అనే నైతిక హక్కు లేదని అన్నారు. చిన్న జీయర్ స్వామి తప్పకుండా ఆదివాసి సంఘాలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు లేనిపక్షంలో ఆదివాసి సంఘం జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ నాయకపోడు జిల్లా నాయకులు అరిగెల సమ్మయ్య కొత్త రాజకుమార్ కొత్త నరేష్ రాజేందర్ కృష్ణ పొట్లపల్లి వినోద్ అరిగెల సారమ్మ రెడ్డి సార్ అక్క ఆకుల ఉప్పలమ్మ చిర్ర ఎల్లమ్మ అరిగెల కావేరి మందపూర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply