ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలి -SFI

Share this:

హనుమకొండ(V3News): హనుమకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుకునే ఇంటర్మీడియట్ విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ ఎఫ్ ఐ హనుమకొండ జిల్లా అధ్యక్షులు మంద శ్రీకాంత్ అన్నారు గురువారం రోజున జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ ఒకేషనల్ కళాశాలలో విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా మంద శ్రీకాంత్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలన్నారు రాష్ట్రంలో విద్యారంగ సమస్యలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలన్నారు అలాగే జిల్లా ఉపాధ్యక్షులు వేల్పుల చరణ్ యాదవ్ మాట్లాడుతూ హన్మకొండలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వసతులు సరిగా లేవన్నారు టాయిలెట్స్ రూమ్స్ మరుగుదొడ్లు పని చేయడం లేదన్నారు వాటర్ సరఫరా లేకపోవడంతో విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారన్నారు హనుమకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సరైన మౌలిక సదుపాయాలు లేకపోవడంతో విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు అన్నారు ఇప్పటికైనా అధికారులు ప్రజా ప్రతినిధులు స్పందించి విద్యార్థులు సమస్యలను పరిష్కరించాలన్నారు ,లేదంటే రాబోయే రోజుల్లో ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని ఈ సందర్భంగా వారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు కుశాల్ గణేష్ అజార్ వరుణ్ నవ్య ఈన సానియా కృపాకర్ నరేష్ రవితేజ నితీష్ కుమార్ సిద్ధూ విల్సన్ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply