ఇంటింటికెళ్లి ముద్రా లోన్లు అందజేస్తాం

Share this:

రాయల్ బ్యాంక్ ఆఫ్ స్కాట్లాండ్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ముద్ర యోజన పథకం ద్వారా పేదలందరికీ రుణాలు అందించే చర్యలు తీసుకోనున్నట్లు శివాలిక్ ఎంటర్ప్రైజెస్ జిల్లా కోఆర్డినేటర్ భాగ్య లక్ష్మి తెలిపారు. శుక్రవారం అనకాపల్లిలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ పేద ప్రజల స్వయం ఉపాధికై కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ముద్ర పథకాన్ని చాలామంది సద్వినియోగం చేసుకోలేక పోతున్నారు అన్నారు. బ్యాంకుల నుంచి కూడా స్పందన లేకపోవడంతో సమస్య నెలకొందన్నారు. దీంతో ఆర్ బి ఎస్ ద్వారా ఇంటింటికీ తామే వెళ్లి లబ్ధిదారులకు అవగాహన కల్పించి రుణాలు అందజేయనున్నట్లు వెల్లడించారు. ఏప్రిల్ నాటికి 4.50 లక్షల మందికి రుణాలు అందించే లక్ష్యంతో ఆర్ బి ఎస్ బ్యాంక్ పని చేయనుందనారు. దేశవ్యాప్తంగా లబ్ధిదారులకు మేలు చేసే విధంగా క్షేత్రస్థాయిలో తాము పని చేస్తామని ప్రజలు ముద్ర లోన్ లు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు

Leave a Reply