ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ గ్రేటర్ హైదరాబాద్ విపత్తు నివారణ విభాగం కన్వీనర్ గా డాక్టర్ కాచం సత్యనారాయణ గుప్తా నియామకం

Share this:

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ గ్రేటర్ హైదరాబాద్ విపత్తు నివారణ విభాగం కన్వీనర్గా డాక్టర్ కాచం సత్యనారాయణ గుప్తా నియమిస్తూ గ్రేటర్ హైదరాబాద్ చైర్మన్ మామిడి భీమ్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. నగరంలోని రెడ్క్రాస్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో నియామక ఉత్తర్వులను సత్యనారాయణకు అందజేశారు. ఈ సందర్భంగా కాచం సత్యనారాయణ మాట్లాడుతూ రెడ్ క్రాస్ సంస్థ లో బాధ్యతాయుతమైన హోదా దక్కడం ఎంతో బలాన్నిచ్చింది అన్నారు . లాక్ డౌన్ నే పద్యంలో గడిచిన నెల రోజులుగా ప్రతిరోజు 1500 మంది పోలీస్ సిబ్బంది పారిశుద్ధ్య కార్మికులు నిర్వాసితులకు బిర్యానీ బాక్సులు పంపిణీ చేస్తున్నామన్నారు . రెడ్ క్రాస్ సొసైటీ వారు తనకు గౌరవ స్థానాన్ని ఇచ్చి బాధ్యతలు రెట్టింపు చేశారని అన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తానని హామీ ఇచ్చారు

Leave a Reply