ఈ నెల 16, 17న మున్సిపల్ కార్మికుల వంటా-వార్పు మున్సిపల్ సంఘాల జేఏసీ పిలుపు..

Share this:

మున్సిపల్ కార్మికులకు ప్రభుత్వం పెంచిన వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త ఆందోళన కార్యక్రమాలకు సంబంధించి ఐ.ఎఫ్.టి.యు, ఏఐటియుసి, సిఐటియు సంఘాల ఆధ్వర్యంలో ఎన్. ఆర్ భవన్, కోటగల్లీలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (IFTU) రాష్ట్ర నాయకులు ఎం.సుధాకర్, తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (CITU) జిల్లా అధ్యక్షులు గోవర్ధన్, మున్సిపల్ స్టాఫ్ & వర్కర్స్ యూనియన్ (AITUC) జిల్లా అధ్యక్షులు వై. ఓమయ్య లు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికులకు వేతనాలు పెంచుతూ జీవో ఇచ్చి ఆరు నెలలు అవుతుందన్నారు. కానీ ఇప్పటికీ అమలు చేయడం లేదన్నారు. ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మున్సిపల్ కార్మికులకు వేతనాల పెంపు అమలు చేయాలని అనేక దఫాలుగా ఆందోళన కార్యక్రమాలు చేసినా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడడం లేదన్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర కమిటీ పిలుపు భాగంగా ఈ నెల 16, 17 న మున్సిపల్ కార్మికుల ఆధ్వర్యంలో ధర్నాచౌక్లో వంటా-వార్పు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మున్సిపల్ కార్మికులను కోరుతున్నామన్నారు. ఈ నెలాఖరు వరకు ప్రభుత్వం వేతనాల పెంపును అమలు చేయకపోతే జనవరి నెలలో మున్సిపల్ కార్మికుల జేఏసీ ఆధ్వర్యంలో నిరవధిక సమ్మెకు వెళ్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మిక సంఘాల జేఏసీ నాయకులు నర్సింగరావు, కిరణ్, రాములు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply