ఉన్నతమైన జీవితానికి ఆధ్యాత్మికమే దిక్సూచి-ఆధ్యాత్మిక గురువు బాల యోగి శ్యామ్ సుందర్ గిరి మహారాజ్

Share this:

ముధోల్ (V3 News): ఉన్నతమైన జీవితానికి ఆధ్యాత్మిక మార్గమే దిక్సూచని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు బాల యోగి శ్యామ్ సుందర్ గిరి మహారాజ్ అన్నారు. నియోజకవర్గ కేంద్రమైన ముధోల్లో వెనుకబడిన సంఘం ఆధ్వర్యంలో శ్రీ పశుపతినాథ్ శివాలయం సమావేశ మందిరంలో అఖండ హరినామ సప్త కొనసాగుతుంది. ప్రతిరోజు వేకువజామున మహిళలు కాగడా హారతులతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా జ్ఞానేశ్వరి పారాయణం, గాథ భజన, హరి పాఠ, కీర్తన ద్వారా భక్తులకు భగవంతుడి విశేషాలను తెలుపుతున్నారు. ఈ సందర్భంగా ఆధ్యాత్మిక గురువులు మాట్లాడుతూ మానవుని జీవితం ఉన్నతమైనదని పేర్కొన్నారు. భగవంతుని నామస్మరణ చేయడంతో సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయని పేర్కొన్నారు. సత్కారములతో మంచి ఫలితాన్ని పొందవచ్చు అన్నారు. యువకులు చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ సన్మార్గంలో నడవాలన్నారు. ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక గ్రంథాలను పారాయణం చేయాలన్నారు. రాత్రి సమయంలో సురేష్ మహారాజ్ పొఫలికర్ భక్తులకు ఆధ్యాత్మిక గ్రంథాల పారాయణం ప్రాముఖ్యతను వివరించారు. గ్రామంలో అఖండ హరినామ సప్త తో పండగ వాతావరణం నెలకొంది. ఈ కార్యాలయంలో గ్రామాభివృధ్ధి కమిటి అధ్యక్షులు బాబు, ఉపాధ్యక్షుడు పొశెట్టీ, కార్యదర్శి కెరబా వాగ్మరే, కొశాధికారి పొశెట్టీ, సహా కార్యదర్శి నారాయణ, సంఘం సభ్యులు, తాలుకా మున్నురుకాపు సంఘం అధ్యక్షులు రోల్ల రమేశ్, భక్తులు తదితరులు, పాల్గొన్నారు.

Leave a Reply