ఉపసర్పంచ్ తో మా కుటుంబానికి ప్రాణహాని ఉంది. నర్సాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట VRA కుటుంబం నిరసన ధర్నా

Share this:

జనగామ జిల్లా తరిగొప్పుల మండలం లోని నర్సాపూర్ గ్రామానికి చెందిన vra అల్లిబిల్లి కనకయ్య అతని కుటుంబ సభ్యులపై ఉపసర్పంచ్ దాడి చేసి గాయపరచడాని మాకు ప్రాణ హాని ఉందంటూ గ్రామపంచాయతీ ఎదుట ధర్నా చేసిన vra కుటుంబం. కనకయ్య భార్య పై ఉపసర్పంచ్ చేయి చేసుకోవడం తో ఆమె చెవి పగలడంతో పాటు తన కుమారులను కూడా గాయపరచడాని vra వాపోయారు. Vra విధుల్లో భాగంగా ఉపసర్పంచ్ కుటుంబానికి వాటాల ప్రకారం vra చేయవలసి ఉండగా వారు సక్రమంగా డ్యూటీ చేయక పోవడంతో తహశీల్దార్ కార్యాలయం నుండి నోటీసులు వచ్చాయని, పట్టాదారు అయిన నువ్వే విధులు నిర్వహించాలని mro చెప్పడంతో విధులు చేపట్టామని అన్నారు.అదే విధంగా గ్రామంలో ఓ ప్లాట్ మేము కొన్నామని కక్ష్య సాధింపుతో మాపై దాడి చేసాడని బాధితులు అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపసర్పంచ్ పై చట్ట ప్రకారం చర్య తీసుకోవాలని గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు.

Leave a Reply