ఎన్టీపీసీ యాజమాన్యం అక్బర్ నగర్ ప్రాంతాన్ని తరలింపు కాదు, మౌళిక వసతులు కల్పిస్తూ అభివృద్ధి చేయాలి : ప్రజల డిమాండ్.

Share this:

అంతర్గాం మండలం కుందన పల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని అక్బర్ నగర్ ప్రాంతాన్ని ఇతర ప్రాంతాలకు తరలించే యోచన కాకుండా, బూడిద లేవకుండా చర్యలు చేపట్టి, మౌళిక సదుపాయాలు కల్పించి అభివృద్ధి చేయాలని ప్రజలు ఎన్టీపీసీ యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. ఎన్టీపీసీ బూడిద చెరువు వద్ద సమావేశంలో మాట్లాడుతూ కొంతమంది అక్బర్ నగర్, మొగల్ పహాడ్, బద్రిపల్లి ఐఓసీ ఇందిరమ్మ కాలనీ, రాజీవ్ గృహ ప్రాంతాల ప్రజలతో సంప్రదింపులు, చర్చలు జరుపకుండా కుందనపల్లి గ్రామాన్ని తరలించాలని ఎన్ టి పి సి యాజమాన్యాన్ని, జిల్లా కలెక్టర్ సంప్రదించండాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ఊరు తరలించడం మాకు ముఖ్యం కాదని, కుందన పల్లి గ్రామం అభివృద్ధియే మాకు ముఖ్యమని అని అక్బర్ నగర్ నివాసులు తెలియజేశారు. ఈ భూములు ఇళ్ల నిర్మాణం తమ కష్టార్జితాన్ని ఎవ్వరూ బహుమతిగా ఇచ్చింది కాదని గత 40 ఏళ్లుగా ఈ ప్రాంతంలో నివసిస్తున్న తాము ఎక్కడికి వెళ్ళబోమని ఖరాఖండీగా చెప్పారు. అక్బర్ నగర్ లో ఉన్నటువంటి ఏ ఇళ్లను కూడా తరలింపునకు వీలు లేదని, ఏ ఒక్క ఇంటిని ముట్టుకున్నా కూడా ఊరుకునేది లేదని, ఎన్టిపిసి యాజమాన్యం ప్రజలతో చర్చలు జరుపకుండా, గ్రామ సభ అ అనుమతి లేకుండాబూడిది కట్ట ఎత్తు పెంచితే ఊరుకునేది లేదని ఎన్ టి పి సి యాజమాన్యాన్ని హెచ్చరించారు. ఎన్టిపిసి ప్రభావిత గ్రామలైన కుందనపల్లి, అక్బర్ నగర్ యాష్ పౌండ్ వద్ద ఇక్కడి భూములు తీసుకుని ఎన్టిపిసి యాష్ వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా అనేక రకాలైన ఇబ్బందులను ఎదర్కొంటున్నామని, అనారోగ్యాల పాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల పట్ల ఎన్టిపిసి అధికారులు నిర్లక్ష్య ధోరణి అవలంభిస్తున్నారని ఆరోపించారు. ఎన్ టి పి సి యాజమాన్యం ఇప్పటికైనా నిర్లక్ష్య ధోరణి విడనాడి ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు హెల్త్ కార్డులు పంపిణీ చేయాలని కోరారు. అక్బర్ నగర్ ప్రాంతంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం మిషన్ భగీరథ ద్వారా స్వచ్ఛమైన త్రాగునీరు రోడ్ల అభివృద్ధి తదితర మౌళిక సదుపాయాలు కల్పించి అభివృద్ధి చేయాలని కోరారు. ఎన్టీపీసీ యాజమాన్యం వారు నిర్వహించే సచ్ దేవా, సెయింట్ క్లైర్, కేంద్రీయ విద్యాలయాల మాదిరి ఇక్కడి పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించడంతో పాటు మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు.

Leave a Reply