ఎన్ని వేవ్ లు వచ్చినా ఎదుర్కోనేందుకు ప్రభుత్వం సిద్దం-మంత్రి వేముల ప్రశాంత్​ రెడ్డి

Share this:

కోటి 50 లక్షలతో నియోజక వర్గంలోని అన్ని ప్రభుత్వ దవాఖానాల్లో ఆక్సిజన్ సౌకర్యం ఏర్పాటు

భీంగల్ ప్రభుత్వ దవాఖానలో ఆక్సిజన్ సేవల ప్రారంభం

గతంలో వచ్చి పోయిన కోవిడ్ అందించిన అనుభవాలను దృష్టిలో ఉంచుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ సారి ఎన్ని వేవ్ లు వచ్చినా ఎదుర్కోనేందుకు సిద్దంగా ఉందని రొడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్​ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం నిజామాబాద్ జిల్లా భీమ్ గల్ కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో ఆక్సిజన్ అందించే సేవలను ఆయన ప్రారంబించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజక వర్గంలోని అన్ని ప్రభుత్వ దవాఖానల్లో ఆక్సిజన్ సేవలు అందేలా ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. గతంలో వచ్చి పోయిన కోవిడ్ సమయంలో నియోజక వర్గంలోని ప్రజలకు ఆక్సిజన్ సేవలు అందక పడిన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ముందు జాగ్రత్తగా ఆక్సిజన్ సేవలను ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. ఆక్సిజన్ కొరకు ప్రజలు జిల్లా కేంద్రానికి వెల్లవలసిన పని లేదన్నారు. వేల్పూర్, మోర్తాడ్, బాల్కొండ మండల కేంద్రాల్లోని ప్రభుత్వ దవాఖానాల్లో ఆక్సిజన్ సేవలతో పాటు ఐసీయూ బెడ్ లను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. మూడో వేవ్ తో పాటు ఎన్ని వేవ్ లు వచ్చినా ఈ సారి ఏ ఒక్కరు ఆక్సిజన్ అందక చనిపోవద్దనే తన లక్ష్యమన్నారు. తన మిత్రులతో పాటు భార్య అందించిన రూ కోటి 50 లక్షలతో నియోజక వర్గంలోని అన్ని ప్రభుత్వ దవాఖానాల్లో వీటిని ఏర్పాటు చేయడం జరిగిందని, నిధులు అందించి సహకరించిన మిత్రులతో పాటు తన భార్యకు ఈ సందర్భంగా మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.ప్రభుత్వం కోవిడ్ మూడో వేవ్ వచ్చినా ఎదుర్కోనేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రజలు కూడ ప్రతి ఒక్కరు కోవిడ్ నిభందనలు పాటించాలని సూచించారు.అధికారులు ఆర్ డి ఓ శ్రీనివాస్ ఎమ్మార్వో రాజేందర్ ఎంపీడీవో రాజేశ్వర్ మున్సిపల్ కమిషనర్ గోప్ప గంగాధర్ ఏఈ రఘు నాయకులు జడ్పీటీసీ చౌట్పల్లి రవి, ఎంపీపీ ఆర్మూర్ మహేశ్, పార్టీ మండల అధ్యక్షుడు దొనకంటి నర్సయ్య, పట్టణ అధ్యక్షుడు మల్లెల లక్ష్మణ్, మున్సిపల్ చైర్ పర్శన్ మల్లెల రాజశ్రీ, మాజీ ఎంపీపీ కన్నె సురెందర్, రైతుబందు అధ్యక్షుడు బదావత్ శర్మనాయక్, నాయకులు తుక్కాజీ నాయక్,గుణ్వీర్ రెడ్డి, జిల్లా కో ఆప్షన్ నెంబర్ మోయిస్,కౌన్సిలర్లు సతీశ్ గౌడ్​, మల్లెల అనుపమ ప్రసాద్ బొదిరే నర్సయ్య, సీహెచ్ గంగాధర్,బోర్ లింగం, మున్సిపల్ కో ఆప్షన్ నెంబర్ శోభ భూపతి రావు పర్స నవీన్ మరియు వివిధ,గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు, కార్యకర్తలు,తదితరులు ఉన్నారు.

Leave a Reply