ఎమ్మార్పీఎస్ నిరాహారదీక్ష కి కాంగ్రెస్ నాయకులు మద్దతు

Share this:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ: ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్యాంగాన్ని మార్చాలంటూ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపట్టారు ఈ నిరసనకు కాంగ్రెస్ నాయకులు టి పి సి సి సభ్యులు ఎడవల్లి కృష్ణ మద్దతు తెలిపారు ఆయన మాట్లాడుతూ రాజ్యాంగాన్ని మార్చాలంటు చేసిన వ్యాఖ్యలు ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే వెనక్కి తీసుకోవాలని భారత రాజ్యాంగాన్ని అవమానించినందుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు,రాజ్యాంగ సవరణ వేరు రాజ్యాంగాన్ని మార్చడం వేరు అని ప్రపంచంలో అతిపెద్ద రాజ్యాంగం మనది, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎంతో కష్టపడి బ్రిటిష్ మరియు మరి కొన్ని రాజ్యాంగాలను అధ్యయనం చేసి రూపొందించిన ఈ రాజ్యాంగము బలహీన వర్గాలు హరిజనులు గిరిజనులు ఎంతో వెనుకబడి ఉన్నవారికి ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించటం కొరకు రూపొందించినవారు, మరి ఆయనకు ఏ రాజ్యాంగం కావాలో తన ముఖ్యమంత్రి పదవి కోసం తన కుటుంబం పరిపాలించడం కోసం రాజ్యాంగము మార్చలా అంటూ ఎద్దేవా చేసారు, ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు సోమయ్య కత్తి శీను దండోరా శీను నాగమణి తదితరులు పాల్గొన్నారు

Leave a Reply