ఏడు లక్షల రూపాయల విలువ చేసే నల్ల బెల్లం పట్టుకున్న సీరోల్ ఎస్సై సంతోష్ రావు

Share this:

మహబూబాబాద్ జిల్లా కురవి సీరోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏడు లక్షల రూపాయల విలువ చేసే నల్ల బెల్లం పట్టుకున్న సీరోల్ ఎస్సై సంతోష్ రావు ఉదయం 5:00 గంటల ప్రాంతంలో పక్క సమాచారంతో కంపెల్లి శివారు వద్ద వాహన తనిఖీ చేయుచుండగా ఒక డి సి ఎం వాహనం (KA 07 1038 ) అనుమానాస్పదంగా ఉన్నందున, ఆపి తనిఖీ చేయగా అందులో తెలంగాణ ప్రభుత్వం నిషేధించిన 160 బస్తాల (80 క్వింటాలు) నల్ల బెళ్ళం, 10 బస్తాల (05 క్వింటాలు) పటిక లభించింది. దీని విలువ ఏడు లక్షల రూపాయలు ఉంటుంది.. దీనిని చిత్తూరు జిల్లా నుండి కురవి కి చెందిన గుగులోతు అశోక్ కి సరఫరా చేస్తున్నట్లుగా డి సి ఎం డ్రైవర్ మెడిది రాజేష్ తెలిపినారు. డిసిఎం తో పాటు ఇద్దరినీ అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేయడం జరిగింది.సీరోల్ ఎస్సై సంతోష్ రావు, కానిస్టేబుల్ విద్యాసాగర్ మరియు సిబ్బందిని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ప్రత్యేకంగా అభినందించారు. మరిపెడ సర్కిల్ పరిధిలో అక్రమ వ్యాపారాలకు తావులేదు, అక్రమాలపై ఎప్పటికప్పుడు ప్రతేక నిఘా పెట్టి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మరిపెడ సర్కిల్ ఇన్స్పెక్టర్ N సాగర్ తెలియచేశారు.

Leave a Reply