ఏపీ ప్రభుత్వం కుట్రను అడ్డుకోవాలి : అయ్యగారి ప్రభాకర్ రెడ్డి

Share this:

కొత్తకోట, V3 న్యూస్ : వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణ కేంద్రంలో రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు జిల్లా, మండల, బూత్ స్థాయి అధ్యక్షుల ఒక్క రోజు దీక్షలో భాగంగా జిల్లా అధ్యక్షులు అయ్యగారి ప్రభాకర్ రెడ్డి దీక్ష చేపట్టారు.ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ… ఏపి ప్రభుత్వం తెలంగాణకు రావలసిన శ్రీశైలం వరద నీటిని అక్రమంగా ఆంధ్రకు తరలిస్తుందని, దీని వలన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలు నీటి కొరత ఏర్పడి వేల ఎకరాలు బీడు భూములుగా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.కేసిఆర్ ప్రభుత్వం మేల్కోని ఏపీ ప్రభుత్వం కుట్రను అడ్డుకోవాలని అన్నారు.లేనియెడల లాక్ డౌన్ అనంతరం బీజేపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అందోళన చేస్తామని ఆయన హెచ్చరించారు.

Leave a Reply