ఏసీబీకి పట్టుబడ్డ సచివాలయం వార్డు రెవెన్యూ సెక్రటరీ

Share this:

చిలకలూరిపేట పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీలో ఉన్న వార్డు సచివాలయంలో పనిచేస్తున్న వార్డు రెవెన్యూ సెక్రటరీ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. జనన ధ్రువీకరణ పత్రం లేట్ రిజిస్ట్రేషన్ కు సంబంధించి దరఖాస్తు దారుడు నుంచి రూ. 3వేలు డిమాండ్ చేసిన విఆర్వో శ్రీనివాస్ రావును శుక్రవారం ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.చిలకలూరిపేట పట్టణంలోని వైఎస్సార్ కాలనీకి చెందిన రేపూడి రాజేష్ తన ఐదు సంవత్సరాల కుమారుడికి జనన ధ్రువీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసుకోగా… ఏడు నెలల కాలం గా వి ఆర్ ఓ తిప్పుతున్నాడు. రూ.3 వేలు డిమాండ్ చేయడంతో రాజేష్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. పథకం ప్రకారం ఏసీబీ అధికారులు శుక్రవారం వలపన్ని వీఆర్వో ను పట్టుకున్నారు.

Leave a Reply