ఐటీడీఏ ను ముట్టడించిన గిరిజనులు

Share this:

విశాఖ జిల్లా పాడేరులో గిరిజన సంఘం ఆద్వర్యంలో నిర్వహించిన ఛలో ఐటిడిఎ కార్యక్రమం విజయవంతం గా కొనసాగింది. ఐటిడిఎ ను గిరిజనులు ముట్టడించారు. ఇటీవలే గిరిజనుల పట్ల ప్రభుత్వాలు చేస్తున్న నిరంకుశ పరిస్థితులను బట్టి ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ నుండి ఎస్.టి వాల్మీకి,ఎస్.టి భగత,గౌడ కులాలు తొలగించడం పట్ల ఆందోళన గురైన గిరిజనులు చలో ఐటిడిఎ ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం నుండి భారీ ఎత్తున్న గిరిజన ప్రజలు ర్యాలీగా పాడేరు ఐటిడిఎ కు చేరుకొని ఆందోళన చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.అప్పలనర్స మాట్లాడుతూ గిరిజనులంటే ప్రభుత్వాలకు చిన్న చూపు అని అందుకే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయన్నారు.

Leave a Reply