ఐపీఎల్ కు ఎంపికైన కడపజిల్లా కుర్రాడు మారెంరెడ్డి హరీష్ శంకర్ రెడ్డి

Share this:

చిన్నమండెం,V3 న్యూస్ : ప్రతిష్ఠాత్మకమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్-2021 టోర్నమెంట్‌లో ఆడే అవకాశాన్ని దక్కించుకున్నాడు. యంగ్ క్రికెటర్. ఆయన పేరు మారంరెడ్డి హరిశంకర్ రెడ్డి. వయస్సు 22 సంవత్సరాలు. స్వస్థలం రాయచోటి లోని చిన్నమండెం మండలం బోనాల గ్రామం నాగూరివాండ్లపల్లెలో వాసి కుడిచేతి వాటం మీడియం పేస్ బౌలర్. తొలివిడత మినీ ఐపీఎల్ వేలంపాటలో ఆయనకు ఛాన్స్‌ లభించింది. 1,114 మంది వేర్వేరు దేశాలు టీమ్‌లకు చెందిన క్రికెటర్లు పోటీ పడగా.. 292 మందికి మాత్రమే ఇందులో అవకాశం లభించింది. ఆ 292 మంది క్రికెటర్లలో మారంరెడ్డి కు ఆవకాశం కల్గింది.
ఐ పి ఎల్ క్రికెట్ పోటీలలో స్థానాన్ని దక్కించుకోవడం పట్ల చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఐ పి ఎల్ లో చెన్నై ప్రాంఛైజీ తీసుకోవడం చాలా హర్షదాయ కమన్నారు. హరిశంకర్ రెడ్డి క్రికెట్ పోటీలలో ఉత్తమ ప్రతిభను ప్రదర్శించి అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని ఆయన ఆకాంక్షించారు. గ్రామీణ ప్రాంతాలలోని యువ క్రీడాకారులకు హరిశంకర్ రెడ్డి ఆదర్శంగా నిలవాలని శ్రీకాంత్ రెడ్డి ఆకాంక్షించారు ఆ ఊరి వాళ్లు మాట్లాడుతూ ఇలాంటి వాళ్లు ఐ పి ఎల్ కు ఎంపికవడం మావూరి అదృష్టమని తెలియజేశారు.

Leave a Reply