కందే హరి ప్రసాద్ నిరసన దీక్ష

Share this:

ఆమనగల్లు, V3 న్యూస్ : కెసిఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బిజేపి ఒక్కరోజు దీక్ష చేపట్టింది. పార్టీ పిలుపు మేరకు రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు లో మాజీ ZPTC, రాష్ట్ర బిజేపి కార్యవర్గ సభ్యులు కందే హరి ప్రసాద్ తన నివాసంలో ఒక్క రోజు నిరసన దీక్ష చేపట్టారు. మహబూబ్ నగర్ జిల్లాకు సాగునీటి విషయంలో భవిష్యత్తులో తీవ్ర నష్టం జరిగే చర్యలు తీసుకుంటున్న ఏపి ప్రభుత్వం కుట్రకు వ్యతిరేకంగా ఈ నిరసన దీక్షలు చేపట్టినట్టు వారు తెలిపారు. ఈ విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం గట్టిగా ఎదుర్కోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

Leave a Reply