కక్కిరేణి గ్రామంలో క్రీడాకారులకు షూ పంపిణీ

Share this:

రామన్నపేట మండలంలోని కక్కిరేణి గ్రామంలో ఈరోజు కొమ్ము చాడ దశరథ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రామంలో ఉన్న క్రీడాకారులకు రిటైర్డ్ టీచర్ గీదా సురేందర్ రెడ్డి గారు షూ పంపిణీ చేయడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులలో క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించుకోవడానికి , వ్యాయామం ద్వారా శారీరక దృఢత్వాన్ని పెంపొందించుకోవడం కోసం పాదాల రక్షణ కోసం రన్నింగ్ షూ అవసరమని .. వివిధ క్రీడా రంగాలలో నైపుణ్యతను సాధించి గ్రామానికి క్రీడల్లో మంచి పేరు తీసుకురావాలని ఫౌండేషన్ ద్వారా మరిన్ని వివిధ సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకురావడం కోసం కృషి చేస్తుందని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్త , వార్డు సభ్యులు వేముల సైదులు , తేడ్ల రాజ్ కుమార్ , సోమబోయిన దుఖేందర్ , నల్ల ప్రసాద్ , క్రీడాకారులు చిల్ల భరత్ కుమార్ , అంకిరెడ్డి మత్స్యగిరి , జోగు కిషన్ , కిన్నెర మత్స్యగిరి , అంకిరెడ్డి అనిల్ , సింగారం దిలీప్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply