కడప జిల్లా రాయచోటి నియోజకవర్గం, బ్రాహ్మణ వీధిలో పురాతన శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం పునర్నిర్మాణం

Share this:

కడప జిల్లా రాయచోటి నియోజకవర్గం గాలివీడు మండలం బ్రాహ్మణ వీధిలో సుమారు 700 సంవత్సరాలకు పూర్వం నిర్మించబడిన అత్యంత పురాతనమైన, మహిమాన్వితమైన మరియు శక్తివంతమైన శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం మరియు శ్రీ మల్లికార్జునస్వామి ఆలయాలు ఉన్నవి.సాక్షాత్తు అన్నమాచార్యులు వారు స్వయంగా దర్శించి కీర్తించి స్తుతించిన ఆలయాలు ఇవి.
కాల క్రమేణా అవి పూర్తిస్థాయి శిధిలావస్థకు చేరుకున్నాయి. ఈ పరిస్థితిని గమనించిన స్థానిక యువకులు ఒక కమిటీగా ఏర్పడి ఆ ఆలయాల పునర్నిర్మాణం మరియు అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఈ ఆలయాల పునర్నిర్మాణం మరియు అభివృద్ధి కోసం ప్రజలు దాతలు విరివిగా విరాళాలు ఇస్తూ వస్తున్నారు. ఇప్పటికే దాదాపు 50లక్షల పైచిలుకు మొత్తం ఖర్చు చేసి 80% పనులు పూర్తి చేయించడం జరిగింది. ఇందులో ఎటువంటి అవకతవకలు జరగ్గూడదనే ఉద్దేశ్యం ఒక సంవత్సరం నుండీ ప్రతి శనివారం ప్రజల సమక్షంలో వారాంతపు సమావేశం నిర్వహిస్తున్నారు. గుడి నిర్మాణానికి సంబంధించిన విషయాలపై కమిటీ సభ్యులు అందరూ ఈ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోవడం జరిగేది. అలాగే చందాలకు సంబంధించి పారదర్శకత కోసం ఇప్పటి వరకు వచ్చిన ప్రతి విరాళాన్ని ఫేస్బుక్ గ్రూపు మరియు వాట్సాప్ గ్రూపులలో అనౌన్స్ చేస్తు వస్తున్నారు వారాంతపు సమావేశం గుడి నిర్మాణానికి జరిగిన జమా ఖర్చులు అన్నింటిని ప్రజలు దాతలు ముందు ఉంచుతున్నారు

Leave a Reply