కడ్తాల్ అయ్యప్ప ఆలయంలో కన్నుల పండువగా మండల పూజ మహోత్సవం

Share this:

కడ్తాల శ్రీ ధర్మ శాస్త అయ్యప్ప ఆలయం అయ్యప్ప నామస్మరణతో మారుమోగింది. ఆదివారం రాత్రి ఆలయ గురుస్వామి నర్సారెడ్డి ఆధ్వర్యంలో మండల పూజా మహోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ మహోత్సవ కార్యక్రమానికి అయ్యప్ప స్వాములు, భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఈ సందర్భంగా గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, అయ్యప్ప స్వామి ఉత్సవ విగ్రహాలకు పంచామృతాలతో, రంగురంగుల పువ్వులతో అభిషేకం జరిపారు.పదునెట్టాంబడిని పద్దెనిమిది కలశాలతో, రకరకాల పూలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పదునెట్టాంబడి వెలిగించారు. పడిపూజ మహోత్సవం సందర్భంగా అయ్యప్ప స్వాములు ఆలపించిన భక్తిగీతాలు విశేషంగా ఆకట్టుకున్నాయి.

Leave a Reply