కన్నుల పండువగా అయ్యప్ప పడిపూజ

Share this:

నిర్మల్ పట్టణంలోని బాగులవాడ అయ్యప్ప నామస్మరణతో మారుమోగింది.శ్రీకాంత్ యాదవ్ స్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప మహా పడిపూజ శుక్రవారం కన్నుల పండువగా నిర్వహించారు. పడిపూజ మహోత్సవానికి అయ్యప్ప స్వాములు, భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఈ సందర్భంగా గణపతి, సుభ్రమణ్య స్వామి, అయ్యప్ప స్వామి ఉత్సవ విగ్రహాలకు పంచామృతాలతో అభిషేకం జరిపారు. అనంతరం పదునెట్టాంబడి వెలిగించారు. పడిపూజ మహోత్సవం సందర్భంగా అయ్యప్ప స్వాములు ఆలపించిన భక్తిగీతాలు విశేషంగా ఆకట్టుకున్నాయి.

Leave a Reply