కరోనా వైరస్ ను తరిమేయండి..మత్తు పదార్థాలకు బానిస కాకండి….జాగృతి పోలీస్ కళాబృందం

Share this:

జనగామ జిల్లా:దేవరుప్పుల మండలం, మన్ పహాడ్ గ్రామంలో ‘జాగృతి పోలీస్ కళాబృందం’ పోలీస్ కమిషనరేట్ వరంగల్ వారు అవగాహన సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా వాళ్ళు ప్రజలకు కరోనా మహమ్మారి,గుట్కా,గంజాయి,100 డయల్,రోడ్డుప్రమాదాలు,సైబర్ నేరాలు, తదితర అంశాలపై పాటల రూపంగా,నాటికల రూపంగా,మ్యూజిక్ ద్వారా ప్రజలకు తెలియపరచారు.ఈకార్యక్రమానికి ముఖ్యతిధిగా ఏసీపీ గొల్ల.రమేష్ పాల్గొని మాట్లాడుతూ కరోనా మహమ్మారి మళ్ళీ విజృంభిస్తుంది కావున తప్పనిసరిగా అందరూ మస్కులు ధరించాలని.
సామాజిక దూరం పాటించాలని..
బయటదొరికే తినిబండారాలు తినకూడదని..
పరిశుభ్రమైన దుస్తులనే ధరించాలని..
యువత ఎక్కువగా మత్తుపదార్ధాలకు బానిసై మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని..
అందుకని ఎవరైనా గుట్కా గాని,గంజాయి గాని మీపరిసర ప్రాంతాల్లో అమ్మినా,ఎవరైనా వాడిన మాకు తెలియజేయాలని..
ఎక్కువగా మధ్యం సేవించి వాహనాలు నడుపరాదని..
ద్విచక్రవాహనదారులు హెల్మెట్ ధరించాలని..
మద్యానికి బానిసై గ్రామాలలో చిల్లర దొంగతనాలు చేస్తున్నారని..
అందుకు గ్రామాల్లో అక్కడక్కడ సిసి కెమెరాలు ఏర్పాటుచేసుకోవలని..
సూచించారు.ఈకార్యక్రమంలో సర్పంచ్ వర్రే.మధు,ఎంపిటిసి మహ్మద్.జాకీర్,ఎస్సై నరోత్తమ్ రెడ్డి,గ్రామస్తులు,పాల్గొన్నారు.

Leave a Reply