కరోనా వైరస్ పై పశ్చిమ గోదావరి జిల్లా ప్రభుత్వ యంత్రాంగం సమీక్ష

Share this:

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ పై పశ్చిమ గోదావరి జిల్లా ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రస్తుతం జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కానప్పటికీ ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగానే పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు జిల్లా వ్యాప్తంగా అన్ని మండల తాసిల్దార్ కార్యాలయలతో పాటు మండల డెవలప్మెంట్ అధికారి కార్యాలయంలో ప్రత్యేక ఎల్సీడీ స్క్రీన్లను ఏర్పాటు చేసి కరోనాపై జిల్లా యంత్రాంగానికి అవగాహన కల్పించే విధంగా రేవు ముత్యాలరాజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లాలో ఉన్న వాలంటీర్లు, వైద్యాధికారులు, వైద్య వాలంటీర్లు, విఆర్వో, వీఆర్ఏలు అందరూ హాజరు కావాలని రెండు రోజుల ముందే ఆదేశాలు జారీ చేశారు. ఏ ఒక్కరు వీడియో కాన్ఫరెన్స్ రాకపోయినా శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలతో ప్రతి ఒక్కరు కూడా వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొని జిల్లా కలెక్టర్ సూచనలను శ్రద్ధగా ఆలకించారు.

Leave a Reply