కర్నూలు జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయుధపూజ

Share this:

జిల్లా ప్రజలందరికీ విజయ దశమి శుభాకాంక్షలు తెల్పిన … జిల్లా ఎస్పీ. దసరా పండుగను పురస్కరించుకొని గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీసు ఆయుధాలకు మరియు పోలీసు వాహనాలకు జిల్లా ఎస్పీ సిహెచ్. సుధీర్ కుమార్ రెడ్డి ఐపియస్ గారు పూజలు నిర్వహించారు.అనంతరం జిల్లా ఎస్పీ గారు జమ్మిచెట్టుకు కూడా పూజలు నిర్వహించి ప్రదక్షిణలు చేశారు. జిల్లా ప్రజలందరికీ విజయ దశమి శుభాకాంక్షలు తెలియజేశారు.కోవిడ్ నిబంధనలు పాటిస్తూ జిల్లాలోని ప్రతీ ఒక్కరూ సుఖసంతోషాలతో దసరా పండుగను జరుపుకోవాలని జిల్లా ఎస్పీ గారు ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఎఆర్ అడిషనల్ ఎస్పీ ఎమ్.కె రాధాక్రిష్ణ , డిఎస్పీలు కెవి మహేష్, ఇలియాజ్ బాషా, వై. రవీంద్రా రెడ్డి, డిపిఓ ఎఓ సురేష్ బాబు, ఎస్పీ గారి పిఎ నాగరాజు, ఆర్ ఐలు రమణ, సురేంద్రా రెడ్డి, సుధాకర్, ఆర్ ఎస్సైలు పాల్గొన్నారు.

Leave a Reply