కుప్పంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటన

Share this:

కుప్పం గ‌డ్డ‌…చంద్ర‌బాబునాయుడు గారి అడ్డా.
ప్ర‌తీ గ‌డ‌ప‌కీ సాయం అందించింది మేము. ప్ర‌తీ ఇంటికి మేలు చేసింది చంద్రబాబు గారు.

నియోజ‌క‌వ‌ర్గంలో అభివృద్ధి-సంక్షేమంపై చంద్ర‌బాబు గారిది చెరగని ముద్ర. గెలిచి రెండున్నర ఏళ్ళు అయ్యింది జగన్ రెడ్డి ఒక్క సారైనా కుప్పం వచ్చారా? కనీసం కుప్పం పేరు కూడా ఆయన నోటి నుండి రాలేదు.

కుప్పం ప్రజలంటే జగన్ రెడ్డికి కోపం. అందుకే రాడు. కుప్పం ప్రజల ఓట్లు జగన్ రెడ్డికి కావాలి…కానీ కుప్పం ప్రజలు అవసరం లేదు. కుప్పం అభివృద్ధి పట్టదు.

కుప్పం దేవాలయం. అలాంటి నియోజకవర్గంలోకి ఇప్పుడు దొంగలు, రౌడీలు, ఎర్ర చెందనం స్మగ్లర్లు ప్రవేశించారు.కుప్పం ప్రజల్ని కొనడానికి వైసీపీ కుక్కల్ని ఇక్కడ దింపారు. అమ్ముడు పోవడానికి ఇది వైసీపీ చిల్లర బ్యాచ్చ్ కాదు కుప్పం పౌరుషం.

నేను పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా కుప్పం కి 300 కోట్లు కేటాయించి అభివృద్ధి చేసాం.
ఇక్కడే తిష్ట వేసిన పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్ది రెడ్డి 3 పైసలు కూడా కుప్పం కి కేటాయించలేదు. ఏ ముఖం పెట్టుకొని కుప్పంలో ఓట్లు అడుగుతున్నారు. ఆఖరికి హంద్రీనీవా పనులు కూడా ఆపేసి కుప్పంకి నీరు రాకుండా చేసారు.

కుప్పంకి ఏమి చెయ్యని వైసీపీ కి ఎందుకు ఓట్లు వెయ్యాలని ప్రశ్నించండి. ఇడుపులపాయ రాజకీయాలు కుప్పంలో కుదరవు. మన అధికారం వచ్చిన తరువాత రెచ్చిపోతున్న వైసీపీ వాళ్లకు వడ్డీతో సహా చెల్లిస్తా. గెలుపు పై నమ్మకం లేని వాడే అడ్డమైన పనులు చేస్తారు.

ప్రజా బలం లేదు కాబట్టే జగన్ రెడ్డి పోలీస్ బలాన్ని, అధికార బలాన్ని నమ్ముకొని ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నాడు. రాష్ట్రంలో ఎలక్షన్ జరగడం లేదు అంతా సెలక్షనే.
పోలీసుల బెదిరింపులు, అక్రమ అరెస్టులు, నామినేషన్ పత్రాలు చించెయ్యడం, దొంగ సంతకాలతో విత్ డ్రా. ఏకగ్రీవాలు, దొంగ ఓట్లు ఎన్నికల్లో గెలవడానికి జగన్ రెడ్డి ఎంతకైనా దిగజారిపోతాడు.

ఒక్క ఛాన్స్ అడిగాడు 151 సీట్లు ఇచ్చారు, 22 ఎంపీలను ఇచ్చారు. జగన్ రెడ్డి సీఎం అయ్యి రెండున్నర ఏళ్ళు అయ్యింది. ఇక్కడ ఉన్న అందరిని ఒక్క ప్రశ్న అడుగుతున్నా మీ జీవితాల్లో ఎం మార్పు వచ్చింది? రెండున్నర ఏళ్ళు అయినా ఇసుక ఇవ్వలేని వేస్టుగాడు మీ జీవితాలను మార్చగలడా? ఒక్క సారి ఆలోచించండి. ఒళ్ళు కోవెక్కి కొట్టుకుంటున్న వైసీపీ వాళ్లలో మార్పు రావాలి అంటే ఒక దెబ్బ పడాలి.

జగన్ రెడ్డి బయటకి రావాలంటే మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ కి ఓటు వెయ్యండి. వైసీపీ వాళ్ళ బలుపు తగ్గాలంటే టీడీపీ కి ఓటు వెయ్యండి. మేము గెలిస్తే ఎం చేస్తామో చెబుతున్నాం. పన్నులు తగ్గిస్తాం, అభివృద్ధి చేస్తాం. జగన్ రెడ్డి ఎత్తేసిన అన్నా క్యాంటిన్ తెరుస్తాం. చెత్త పై పన్ను ఎత్తేస్తాం.

వైసీపీ వాళ్ళు ఎం చెప్తున్నారు? జగన్ రెడ్డి కట్టింగ్ మాస్టర్ అని చెబుతున్నారు. ఓటు వెయ్యకపోతే పెన్షన్ కట్ చేస్తాం , రేషన్ కట్ చేస్తాం, సంక్షేమ కార్యక్రమాలు కట్ చేస్తాం అంటున్నారు. నీ అబ్బ సొమ్మా కట్ చెయ్యడానికి? చెత్త మీద పన్ను వేసే ప్రభుత్వాన్ని ఎం అనాలి? అందుకే జగన్ రెడ్డిది చెత్త ప్రభుత్వం.

చంద్రన్న భీమా,విదేశీ విద్య, సంక్రాంతి కానుక, అన్నా క్యాంటీన్, నిరుద్యోగ భృతి కట్ చేసారు.
జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాకా చేసిన ఒకే ఒక పని బాదుడే,బాదుడు…కరెంటు చార్జీలు, బస్ ఛార్జీలు,పెట్రోల్ ధర,డీజిల్ ధర,గ్యాస్ ధర,ఇంటి పన్నులు,చెత్తకు పన్నులు,రేషన్ సరుకుల ధరలు,నిత్యావసర ధరలు,ఫైబర్ నెట్ చార్జీలు,ఇసుక ధరలు,సిమెంట్ ధరలు, రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచుకుంటూ పోతున్నాడు.

దేశమంతా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తే జగన్ రెడ్డి ధరలు తగ్గించనంటూ పేపర్ యాడ్స్ ఇచ్చాడు. సొంత పేపర్, టివికి ఇప్పటి వరకూ 300 కోట్ల రూపాయిల యాడ్స్ ఇచ్చుకున్నాడు.
సొంత డబ్బాకి ఇచ్చిన డబ్బు పెడితే పెట్రోల్, డీజిల్ పై కనీసం రెండు రూపాయిలు తగ్గేది.

చంద్రబాబు గారి పాలన లో యానాం వెళ్దాం అన్నావ్. ఇప్పుడు నీకు సవాల్ దేశంలో ఉన్న ఏ రాష్ట్రమైనా వెళ్దాం వస్తావా? మన రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎంత ఎక్కువ ఉన్నాయో తేలిపోద్ది.

ఫ్యాన్‌కి ఓటేసిన పాపానికి రాష్ట్ర ప్ర‌జ‌లు ఉక్క‌పోస్తున్నా క‌రెంటు బిల్లుల‌కు భ‌య‌ప‌డి ఇంట్లో ఫ్యాన్ వేసుకోవాలంటే భ‌య‌ప‌డి చ‌స్తున్నారు. కుడి చేత్తో 10 రూపాయిలు ఇచ్చి ఎడమ చేత్తో 100 రూపాయిలు కొట్టేసే కన్నింగ్ మెంటాలిటీ జగన్ రెడ్డిది. రాష్ట్రంలో ఎవ్వరైనా హ్యాపీగా ఉన్నారా?

మహిళలకు రక్షణ లేదు. సీఎం ఇంటి పక్కన అత్యాచారం జరిగితే ఈ రోజు వరకూ నిందితులను పట్టుకోలేకపోయారు.

మద్య నిషేధం అన్నారు. బూమ్ బూమ్, ప్రెసిడెంట్ మెడల్, స్పెషల్ స్టేటస్ తెచ్చాడు.

యువతకు ఉద్యోగాలు లేవు. 2.30 లక్షల ఉద్యోగాలు ఇస్తానని 10 వేల ఉద్యోగాలతో జాబ్ లెస్ క్యాలెండర్ ముష్టి వేసాడు. అమ్మ ఒడి ఇస్తున్నామని ప్ర‌చారం చేసుకుంటాడు. అబ్బాయి చ‌దివే బ‌డిని మూసేస్తాడు. ఎయిడెడ్ విద్యా వ్యవస్థ ని నాశనం చేస్తున్నాడు.

రైతు రాజ్యం తెస్తానంటాడు..రైతుల్లేని రాజ్యం చేసేశాడు. విత్తనాలు, ఎరువులు ఇవ్వలేని వాడు రైతుల మెడ కి మీటర్లు తగిలిస్తున్నారు.
ఆఖరికి వృద్ధులను కూడా మోసం చేసాడు. 3 వేల పెన్షన్ అన్నారు 250 పెంచి సరిపెట్టుకోమంటున్నారు. నీ కేసులకు భయపడే వాడు ఎవ్వడూ లేడు జగన్ రెడ్డి. మనం దేశాన్ని దొబ్బి జగన్ రెడ్డిలా జైలుకి వెళ్లడం లేదు.

ఎన్ని కేసులు పెట్టుకుంటావో పెట్టుకో ఒక్క సంతకంతో మొత్తం కేసులు ఎత్తేస్తాం. అక్రమ కేసులు పెడుతున్న వారికి, పెట్టిన వాళ్ళకి చుక్కలు చూపిస్తాం. వైసీపీ వాళ్ళు ఫ్లూటు జింక ముందు ఊదాలి సింహం ముందు కాదు
మన సింహాన్ని చూస్తే వాళ్ళకి ఒణుకు రండి ఎంత మంది వస్తారో తేల్చుకుందాం.

కష్టపడి పనిచేస్తున్న ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడికి మేము అండగా ఉంటాం.
జగన్ రెడ్డి సీన్ అయిపొయింది. తుగ్లక్ పాలనకు ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయం

Leave a Reply