కేంద్రం తక్షణమే బీసీ కుల గణన చేపట్టాలి

Share this:

నారాయణపేట జిల్లా మద్దూర్ మండల కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం తక్షణమే బీసీ కుల గణన చేపట్టాలని బీసీ సంఘం రాష్ట్ర నాయకుడు కేశవులు డిమాండ్ చేశారు. దేశానికి స్వతంత్రం వచ్చి డెబ్భై ఐదు సంవత్సరాలు దాటిపోయినా బీసీల గురించి పట్టించుకునే వారే కరువయ్యారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం నాడు మద్దూరు మండలం కేంద్రంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆర్.కృష్ణయ్య సాధించిన విజయాలపై కరపత్రాన్ని విడుదల చేశారు ఈ సందర్భంగా కేశవ్ మాట్లాడుతూ దేశానికి స్వతంత్రం రాక పూర్వం బ్రిటిష్ కాలంలో1872 లోనే దేశంలో రిజర్వేషన్ వ్యవస్థ ఉండేదాన్ని స్వతంత్రం వచ్చిన తర్వాత బీసీలకు రిజర్వేషన్లు లేకుండా చేశారని ఆందోళన వ్యక్తం చేశారు.1951 సంవత్సరం నుంచి నేటి వరకు దేశంలో జనాభా లెక్కలు తీస్తున్న బీసీల లెక్కలు తీయకపోవడం దురదృష్టకరం ఈ దేశంలో బీసీలకు లెక్కలు తీయమంటే కేంద్ర ప్రభుత్వం బీసీల లెక్కలు చేయడం కుదరదని సుప్రీంకోర్టులో చెప్పడం దుర్మార్గమని అన్నారు చెట్లకు ఉన్న ఈ లెక్కలు లెక్కలు కానీ బీసీలకు ఎందుకు లేవని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మండల్ కమిషన్ లో కూడా బీసీల జనాభా లెక్కలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో 27 శాతం ఉద్యోగాలు ఇవ్వాలని మండల్ కమిషన్ సిఫారసు చేస్తే వాటిలో కేవలం ఒకటి అమలుపరచడం దుర్మార్గమని అన్నారు. 2021 సంవత్సరంలో జనాభా లెక్కలు తీసి క్రమంలో బీసీల లెక్కలు ఉన్నట్లయితే గ్రామాలలోని కుటుంబాలు అందరూ జనాభా లెక్కల సర్వేకు వచ్చే అధికారులను తిరిగి పంపించాలని వారికి జనాభా లెక్కలు ఇవ్వరాదని పిలుపునిచ్చారు బీసీల జనాభా లెక్కలు తీస్తేనే మేము జనాభా లెక్కలు సహకరిస్తామని అందరూ అధికారులకు ఖరాఖండిగా చెప్పాలని పిలుపునిచ్చారు నేటికీ కేంద్ర ప్రభుత్వంలో ఒక బీసీ మంత్రిత్వశాఖ లేకపోవడం దురదృష్టకరమని బీసీ ప్రధానిని చెప్పుకునే నరేంద్ర మోడీ బీసీ సమస్యలు ఏవీ పరిష్కరిస్తున్నారు అని ప్రశ్నించారు. దేశ జనాభాలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరు కలిసి భోజనం రాజ్యము కొరకు పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. వికారాబాద్ జిల్లా బీసీ సంఘం అధ్యక్షులు డాక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారి నాయకత్వంలో గత నలభై ఐదు సంవత్సరాలుగా బీసీల కొరకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం జరిగిందని కృష్ణయ్య గారి పోరాట ఫలితంగానే నేడు దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలుగు రాష్ట్రాల్లో బీసీలకు అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు హాస్టల్. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు బీసీలకు ఫెడరేషన్ లలో రుణాలు ఫీజు రీయింబర్స్మెంటు సాధించిన ఘనత ఆర్.కృష్ణయ్య కే దక్కిందని ఆర్ కృష్ణయ్య నాయకత్వంలో మనమందరం ఏకమై మన హక్కుల కొరకు పోరాటం చేయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కొడంగల్ నియోజకవర్గo జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు మన్నె బస్వరాజ యాదవ్. మండల టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ వంచర్ల గోపాల్. బీసీ సంఘం నాయకులు నెల్లి రాములు ముదిరాజ్. సురేందర్. ఉస్మానియా జేఏసీ ఉద్యమ నాయకుడు సచిన్. జాతీయ మానవ హక్కుల సంఘం నాయకుడు కుప్పగిరి సాయిలు. మైనార్టీ నాయకుడు షఫీ. భీమేష్. సాయిలు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply