కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకోవడం రైతు పోరాటం విజయం

Share this:

రైతు చట్టాలు రద్దు చేయడమే కాదు రైతు కోరుతున్న కనీస మద్దతు ధర చట్టం చేయాలని అఖిల భారత రైతు పోరాట సమన్వయ కమిటీ నాయకులు డిమాండ్ చేశారు.శనివారం భైంసా ఐబీ వద్ద ప్రెస్ మీట్ లో వారు మాట్లాడుతూ
సుదీర్ఘకాలంగా రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దేశంలోని రైతు సంఘాలు ఐక్యంగా పోరాటం కొనసాగాయి. మరీ ముఖ్యంగా ఢిల్లీ సరిహద్దుల్లో దాదాపు సంవత్సర కాలంగా అలుపెరుగని పోరాటం కొనసాగుతుంది. ఇప్పటికి 600 మంది పైగా రైతులు పోరాటంలో అమరులయ్యారు. కాన్వాయ్ తో తొక్కించి చంపిన రైతుల పోరాటం ఆపలేదు. మొక్కవోని ధైర్యంతో పోరాట బావుటా ఎగురవేసి కేంద్ర ప్రభుత్వం కుట్రలను లొంగలేదు. భారతదేశ చరిత్రలో రైతన్న పోరాటం చిరస్థాయిగా నిలిచిపోయినది. సువర్ణ అక్షరాలతో లిఖించ బడుతుంది. రైతుల ఐక్య పోరాటం ముందు కేంద్ర ప్రభుత్వం మోడీ దిగిరాక తప్పలేదు. ఈరోజు ప్రధాన మంత్రి మోడీ గారి స్వయంగా మూడు నల్ల చట్టాలను వెనక్కి తీసుకున్నట్లు ప్రకటించారు, రైతులకు క్షమాపణ చెప్పారు. ఈ విజయం రైతులకు అంకితం. పోరాడి గెలిచిన విజయం. ఈ సందర్భంగా రైతులందరికీ ఏ ఐ కె ఎస్ సి సి రైతు సంఘాల తరఫున జేజేలు పలుకుతున్నాం. పోరాటాల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో *అఖిల భారత రైతు కూలీ సంఘం ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి జే రాజు,మాజీ ఎంపీపీ రాంచందర్ రెడ్డి,pow జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం హరిత,iftu జిల్లా ప్రధాన కార్యదర్శి రామ్ లక్ష్మణ్, దీనజి పాల్గొనడం జరిగింది

Leave a Reply