కొడిమ్యాల లో సినిమా షూటింగ్ సందడి

Share this:

జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం చెప్యాల గ్రామం లోని రైస్ మిల్లు వద్ద” సైదులు” సినిమా షూటింగ్ సందడి మొదలైంది 1980 లో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా సినిమా ఉంటుందని తెలిపారు మరియు నూతన దర్శకుడు బాబా అలాగే నూతన కథానాయిక నాయకులతో కొడిమ్యాల మండల ప్రాంతంలో 45 రోజుల పాటు ఈ సినిమా షూటింగ్ ఉంటుందని అలాగే మండలానికి చెందిన నటీనటులతో హక్కుల్ని కోల్పోతున్న దళితులు హక్కుల కోసం పోరాడితే ఎలా ఉంటుంది అనే కథాంశంతో సినిమా ఉంటుందని అలాగే పల్లెటూరి వాతావరణంలో సినిమా షూటింగ్ జరుపుకోవడం ఆనందంగా ఉందని తెలియజేశారు సినిమా దర్శకుడు బాబా అలాగే మెయిన్ విలన్ పాత్ర పోషిస్తున్న సీనియర్ నటుడు బెనర్జీ మాట్లాడుతూ కొడిమ్యాల కొండగట్టు కోనాపూర్ ప్రాంతాలు షూటింగ్ కు అనువుగా ఉన్నాయని మరి ఇక్కడి ప్రజల ఆప్యాయత బాగుందని చక్కటి పల్లెటూరి వాతావరణంలో చుట్టూ పొలాలు కొండలు సినిమా చిత్రీకరించడం ఆనందంగా ఉందని తెలియజేశారు అలాగే చిత్ర నిర్మాణ సంస్థ ప్రతినిధి బింగి మనోజ్ మాట్లాడుతూ తెలంగాణ ఎంతో ప్రసిద్ధి చెందిందని తెలంగాణ వ్యవసాయ రంగంలో గాని ప్రకృతి లో గాని ప్రసిద్ధిగాంచింది అని సినిమా షూటింగ్ లకు అనువుగా ఈ ప్రాంతం ఉందని 55 రోజుల పాటు సినిమా షూటింగ్ కొడిమ్యాల మండలంలోని జరుగుతోందని పచ్చని ప్రకృతి మధ్య సైదులు సినిమా నిర్మించడం ఆనందంగా ఉందని తెలిపారు అలాగే సినిమా షూటింగ్ సందడి ఉదయం 6:30 గంటలకే మొదలవడంతో షూటింగ్ ని తిలకించడానికి గ్రామస్తులు తండోపతండాలుగా షూటింగ్ స్పాట్ కి రావడం అలాగే మా గ్రామంలో సినిమా షూటింగ్ జరుగుతోందని ఆనందం వ్యక్తం చేశారు గ్రామ ప్రజలు మరియు ఈ సినిమాలో కొడిమ్యాల మండల కేంద్రానికి చెందిన రమేష్ సదానందం నజీర్ మరియు నాచుపల్లి గ్రామానికి చెందిన వారు నటించడం విశేషం

Leave a Reply