కొమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో పర్యటించిన మంత్రి హరీష్ రావు

Share this:

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని అంకుశాపూర్ గ్రామంలో 340 పడకల నూతన ఆసుపత్రి భవన నిర్మాణం పనులకు, జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో నూతన రేడియాలజీ ల్యాబ్ కు శుక్రవారం శంకుస్థాపన చేసిన మంత్రులు హరీష్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి అనంతరం ఏర్పాటు చేసిన సభలోప్రాంగణంలో హరీష్ రావు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు అన్ని రకాల వైద్య సేవలు అందించడానికి సీఎం కేసీఆర్ కట్టుబడి ఉన్నారని చెప్పారు. మారుమూల గ్రామాలలో కూడా వైద్య సేవలు అందించే విధంగా వైద్యులను ఏర్పాటు చేస్తామని మంత్రి హరీష్ రావు అన్నారు. డయల్సీస్ సెంటర్ లేకపోవడంతో ఇక్కడి సామాన్య ప్రజలు మంచిర్యాల, కరీంనగర్, హైదరాబాద్ తదితర పట్టణ ప్రాంతాకు వెలుతున్నరని మంత్రికి విన్నవించిన ఆసిఫాబాద్‌, సిర్పూర్ ఎమ్మెల్యేలు, వారి కోర్కె మేరకు స్పందించిన మంత్రి ఒక్క నెల రోజుల్లోనే ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌ కు డయల్సీస్ సెంటర్లు మంజురు చేస్తామని మంత్రి హామి ఇచ్చారు.
60 ఏళ్ల సమైక్య ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణకు 3 మెడికల్ కాలేజీలు వస్తే 7 ఏళ్ల పాలనలో తెలంగాణకు 17 మెడికల్ కాలేజీలు తెచ్చిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుంది అని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.
340 పడకల అత్యాధునిక ఆసుపత్రి ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుంది అని మంత్రి హరీష్ రావు అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ కోవ లక్ష్మి, ఎమ్మెల్సీ దండే విఠల్, ఎమ్మెల్యే ఆత్రం సక్కు, కోనేరు కొనప్ప, కలెక్టర్ రాహుల్ రాజ్, ఎస్పీ సురేష్ , తెరాస నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply