కోటప్పకొండ తిరుణాళ్ల పోస్టర్ ను ఆవిష్కరించిన ఎమ్మేల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి

Share this:

పవిత్ర పుణ్యక్షేత్రమైన కోటప్పకొండ తిరుణాల సందర్భంగా “చేదుకో కోటయ్య ఆదుకో కోటయ్య” అంటూ సాగే శ్రీ త్రికోటేశ్వరస్వామి తిరుణాళ్లకు సంబంధించిన పోస్టర్ ను నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కోటప్పకొండ త్రికోటేశ్వర దేవస్థానం ఆలయ కమిటీ సభ్యులు కార్యనిర్వాహణాధికారి దేవస్థానం ఆస్థాన పండితులు సమక్షంలో ఆదివారం కోటప్పకొండ తిరుణాల పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఎమ్మేల్యే డాక్టర్ గోపిరెడ్డి మాట్లాడుతూ.. మార్చి 1 న స్వామి వారి తిరుణాళ్ల జరగనుంది. సుమారు 10 లకల మంది భక్తులు రానున్నారు. అందుకు తగ్గట్టుగా రూ.30 కోట్ల వ్యయంతో పనులు ముమ్మరంగా సాగుతున్నాయని వివరించారు. రోడ్డు విస్తరణ పనులు కూడా వేగవంతం చేశామన్నారు. ఈ నెల 25 నాటికి పనులన్నీ పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. వచ్చే భక్తులకు మంచినీళ్లు, మజ్జిగ పంపిణీ చేయనున్నామని.. పారిశుద్యంపై కూడా ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేశామని తెలిపారు. ఈ నెల 18న తిరుణాళ్ల ఏర్పాట్లపై రెండో సన్నాహక సమావేశం జరగనున్నందున… ఈ సమావేశం నాటికి పనులన్ని పూర్తి చేయాలని అధికారులను విజ్ఞప్తి చేశారు. ట్రాఫిక్ జాం కాకుండా రూ.85 లక్షల వ్యయంతో బీటీ రోడ్డును సిద్ధం చేస్తున్నామని తెలిపారు. గురవాయపాలెం చప్టా నిర్మాణం కూడా పూర్తైందని తెలిపారు. గురవాయ పాలెం వద్ద బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేసి ట్రాఫిక్ లేకుండా భక్తులకు మంచి దర్శనం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఆలయ ఈవో అన్నపురెడ్డి రామకోటిరెడ్డి గారు, జెడ్పీటీసీ చిట్టిబాబు, కొండకావూరు సర్పంచ్ నాగిరెడ్డి, క్లినింగ్ అండ్ బ్యూటిఫికేషన్ డైరెక్టర్ చింతా కిరణ్ కుమార్, ముక్కు వెంకటేశ్వరరెడ్డి, కొత్తూరు గోపి, దొడ్డా బ్రహ్మారెడ్డి, ఆలయ పురోహితులు అనిల్ కుమార్, మేళ్ల చెరువు కుమార్ పాల్గొన్నారు.

Leave a Reply