కోటప్ప కొండ శ్రీ త్రికోటేశ్వర స్వామి సన్నిధిలో జ్వాల తోరణం, కోటి దీప మహోత్సవం

Share this:

కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని కోటప్ప కొండ శ్రీ త్రికోటేశ్వర స్వామి సన్నిధిలో జ్వాల తోరణం, కోటి దీప మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గౌ. శాసన సభ్యులు శ్రీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు సతీ సమేతంగా పాల్గొని శ్రీ త్రికొటేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. త్రికోటేశ్వర స్వామి ఆశీస్సులతో నరసరావుపేట ప్రజలు సంతోషంగా ఉండాలని, పంటలు బాగా పండాలని స్వామి వారిని ప్రార్థించారు.కొండపైన చేపట్టిన అనేక అభివృద్ధి పనులన్ని శివరాత్రి కంటే ముందే ఫిబ్రవరి 15 నాటికి పూర్తి అయ్యేలా స్వామి వారి అనుగ్రహం ఉండాలని ఆకాంక్షించారు,శివరాత్రి తిరునాళ్ళను అందరం కలిసి ఘనంగా జరుపుకోవాలని అందుకు ఆ పరమేశ్వరుడు పనులన్ని పూర్తి అయ్యేలా అందరినీ సంకల్పించేలా చూడాలని కోరుకున్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ మోరబోయిన శ్రీనివాసరావు గారు,రొంపిచర్ల జడ్పిటిసి ఓబుల్ రెడ్డి గారు,మూరే రవీంద్రా రెడ్డి గారు,కానక పుల్లారెడ్డి గారు,నిడమనూరి సురేంద్ర గారు,వెన్నపూస నాగిరెడ్డి గారు,ఒంపుగుడి జాన్ గారు,జక్కిరెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి గారు,మట్ల లింగారెడ్డి గారు,జంగం కార్పొరేషన్ డైరెక్టర్ సునీల్ గారు,మరియు వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు

Leave a Reply