ఖనిలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన 1టౌన్ పోలీసులు

Share this:

రామగుండం కమిషనర్ ఎస్.చెంద్ర శేఖర్ రెడ్డి ఐపీఎస్ (డిఐజి) గారి ఆదేశాల మేరకు 1టౌన్ సీఐ గంగాధర రమేష్ బాబు గారి ఆధ్వర్యంలో వాహన చెకింగ్ మరియు స్పెషల్ డ్రంక్ & డ్రైవ్ నిర్వహించడం జరిగింది పట్టుబడ్డ మందుబాబులకు కౌన్సిలింగ్ చేయడం జరిగింది.ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గోదావరిఖని ఏసీపీ గిరిప్రసాద్ గారు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఏసీపీ గిరిప్రసాద్ గారు మాట్లాడుతూ…..మధ్యం సేవించి వాహనాలు నడపడం వలన జరిగే ప్రమాదాల గురించి పూర్తిగా అర్ధమయ్యేలా వారికి వివరించారు.మద్యం సేవించి వాహనం నడపు వారు మానవబాంబు తో సమానం అని మద్యం సేవించిన వారు సరియైన స్పృహలో ఉండకపోవడం వలన వారికి వాహనము పై అదుపు ఉండదు. కావున ప్రమాదాలు జరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. మందుబాబులు చేసే డ్రైవింగ్ వలన వారే కాకుండా ఎటువంటి తప్పు చేయని మిగితా అమాయక ప్రయాణికులు లేదా పాదచారులు ప్రమాదంలో వికలాంగులుగా, లేదా మరణించడం జరుగుతున్నది.వారి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంటుంది. ఇంటి పెద్దదిక్కు రోడ్డు ప్రమాదంలో చనిపోవడం లేదా వికలాంగులుగా మారితే ఆ కుటుంబం వీధిన పడుతుంది. కావున వాహనం నడిపే వారు చాలా బాధ్యతగా నడపవలసి ఉంటుంది. ఇంటి దగ్గర మన కుటుంబ సభ్యులు మన కోసం ఎదురుచుస్తూన్నారు అనే విషయాన్ని వాహనదారులు గుర్తుంచుకొని తమ ప్రయాణాన్ని మొదలుపెట్టాలి మీరు కూడా మీ ఇంటి దగ్గర మీ కొడుకులకు,భర్తలకే కాకుండా మీ ఇంటి దగ్గరి వారికి కూడా మధ్యం సేవించి నడిపితే జరిగే పరిణామాల గురుంచి వివరించి వారిని కూడా జాగృతం చేయాలని తెలిపారు.మధ్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడితే వాహనాన్ని సీజ్ చేయడం తో పాటు లైసెన్సు లు రద్దుకు సిఫారసు చేస్తాన్నామని, వారు జరిమానాలతో పాటుగా జైలు శిక్ష కూడా అనుభవించాలిసి వస్తుందని హెచ్చరించారు .అలాగే మీరు ఏదైనా పాత వాహనం కొన్నట్లైతే అప్పటికప్పుడే వారి పేరు నుండి మీ పేరు లోకి పేపర్లు మార్చుకోవాలని లేనట్లయితే ఇబ్బందులకు గురి అవుతారని కొన్ని సందర్భాల్లో కేసులు కూడా అవుతాయని అని అన్నారు.ఇది కేవలం మీకోసం మీ కుటుంబాల క్షేమం కోసం మాత్రమేనని ఇందులో ఎవర్ని ఇబ్బంది పెట్టాలని లేదు అని తెలపడం జరిగింది.అలాగే ప్రతి ఒక్కరు బయటకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని, సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయరాదని ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నియమాలను పాటించి సురక్షితంగా గమ్యం చేరాలని,ట్రాఫిక్ నియమాలు పాటించడం ద్వారా ప్రమాదాల నుండి బయటపడొచ్చని తద్వారా వారి కుటుంబాలే కాకుండా సమాజం కూడా చక్కగా ఉంటుందని వారికి అర్ధమయ్యేలా వివరించడం జరిగింది.

Leave a Reply