గుంటూరు జిల్లా లో డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి ప్రజా సమస్యలపై పాదయాత్ర

Share this:

భాపట్ల: గుంటూరు జిల్లా బాపట్ల నూతన 2 వ వార్డు నందిరాజు తోట గ్రామంలో బాపట్ల శాసనసభ్యులు మరియు డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి ప్రజా సమస్యలపై పాదయాత్ర చేపట్టారు.నందిరాజు తోట వార్డులో గడప గడప కు సందర్శించి జగనన్న ప్రవేశపెట్టిన పధకాలు అందరికీ అందుతున్నాయా అని డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి అక్కడ వున్న ప్రజలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా విలేఖరుల సమావేశంలో డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి మాట్లాడుతూ నేడు నందిరాజు తోట గ్రామంలోని ప్రజల సంక్షేమం కోసం అభివృద్ధి కోసం పాటుపడుతూ వార్డులో వున్న ప్రజలు అందరికీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు అమలుచేస్తున్న పధకాలు అందేలాగా తోడ్పాటు ను అందించే ముఖ్య ఉద్దేశంతో ప్రజల సమస్యలను తెలుసుకోవటానికి పాదయాత్ర కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది అని ప్రజల నుంచి వస్తున్న మంచి స్పందన మాకు ఆనందం తృప్తిని కలిగిస్తుందని ఈ సందర్భంగా కోన అన్నారు.ప్రజల వద్దకే పాలన అన్న విధంగా వాలంటీర్ల వ్యవస్ధ నడుస్తుందని, ప్రజలకు జగనన్న ప్రభుత్వం నవరత్నాల ద్వారా పధకాలను అందించటమే మా ముందున్న ఏకైక లక్ష్యమని డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి మాట్లాడారు.ఈ కార్యక్రమంలో వైసీపీ పట్టణ అధ్యక్షులు నరాలశెట్టి ప్రకాశరావు, మండల అధ్యక్షులు కోకి రాఘవరెడ్డి,మార్కెట్ యార్డు ఛైర్మన్ గవిని కృష్ణమూర్తి, రాష్ట్ర రహదారులు మరియు భవనాలు అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ అహ్మద్ హుస్సేన్,ఏపీ స్టేట్ ఔట్ సోర్సింగ్ కార్పోరేషన్ డైరెక్టర్ గొర్రెముచ్చు పుష్పరాజ్యం, ఎంపీడీవో రాధాకృష్ణ,వైసీపీ నాయకులు ఇనుగలూరి మాల్యాద్రి, సి కె నాయుడు,చల్లా రామయ్య, మండల నాయకులు నక్కా వీరారెడ్డి,కోటిరెడ్డి,బ్రహ్మారెడ్డి,మునీర్ మరియు వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply