గ్రామాల అభివృది ప్రభుత్వ లక్ష్యం

Share this:

వలిగొండ : గ్రామాల అభివృద్దే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం అని ఆలేరు శాసన సభ్యురాలు,ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి అన్నారు.
మండలంలోని నరసాపురం, దుపెళ్లి గ్రామాలకు ప్రభుత్వం నుండి మంజూరు అయిన ప్రత్యేక అభివృద్ధి నిధులతో సీసీ రోడ్ల నిర్మాణం పనులను ప్రారంభించి ఈ సందర్భముగా ఏర్పాటుచేదిన సమావేశంలో వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి నేరుగా నిధులు అందజేస్తుందని,పేద ప్రజల అభ్యున్నతికి కరోనా కష్టకాలంలో కూడా అభివద్ధి లో ప్రభుత్వం వెనుకడుగు వేయలేదని,గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతి గ్రామపంచాయతికి 25 లక్షల ప్రత్యేక అభివృద్ధి నిధులు మంజూరు చేశారని, వాటితో ప్రస్తుతం సీసీ రోడ్ల నిర్మాణం చేపడుతున్నామని వారు అన్నారు.అనంతరం దుపెళ్లిలో, నరసాపురంలో మంజూరు అయిన 8 కళ్యాణ లక్ష్మీ చెక్కులను వారు పంపిణీ చేశారు.

Leave a Reply