గ్రామాల అభివృద్దే ప్రభుత్వ ధ్యేయం ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి

Share this:

తుర్కపల్లి(V3News): తుర్కపల్లి మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్న ప్రభుత్వ విప్ గ్రామాల అభివృద్ధి ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి అన్నారు. మండలంలోని వెల్లుపల్లి, దత్తాయ పల్లి, వెంకటాపూర్, దెయ్యం బండ, తుర్కపల్లి, మల్కాపూర్, బద్దుతండా, బిల్యా తండా,ముల్కలపల్లి,జేతి రామ్ తండా, సంగ్య తండా, రాంపూర్ పూర్, గ్రామాలలో ఎస్ బి ఎఫ్ నిధుల కింద మంజూరైనా అభివృద్ధి పనులకు శుక్రవారం ఎమ్మెల్యే పార్టీ నాయకులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి గ్రామ పంచాయతీకి 25 లక్షల రూపాయలు మంజూరు చేశారని అన్నారు. ముఖ్యమంత్రి నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకెళ్తోంది ప్రతి గడపకు ప్రభుత్వ పథకాలుఅందుతున్నాయని అన్నారు .గ్రామాల అభివృద్ధి కమిటీలతో కలసి గ్రామ సమస్యలను పరిష్కరించుకోవాలని అభివృద్ధికి నా వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని దత్తాయ పల్లి గ్రామానికి స్పెషల్ అధికారిని నియమించి ప్రణాళికతో పాటు గ్రామ ప్రజల సహకారంతో అభివృద్ధి పరుచుకోవడానికి కలెక్టర్ తో మాట్లాడి అభివృద్ధి పనులు చేసుకుందాము అన్నారు. ముఖ్యమంత్రి గ్రామాల అభివృద్ధి దృష్టిలో ఉంచుకొని 25 లక్షల రూపాయలు నిర్మాణాల కొరకు నిధులు మంజూరు చేశారని అన్నారు.ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ బికు నాయక్, ఎంపీపీ భూక్య సుశీల రవీందర్ నాయక్, వైస్ ఎంపీపీ శ్రీనివాస్, సింగిల్విండో చైర్మన్ సింగిరెడ్డి నరసింహారెడ్డి, కో ఆప్షన్ షరీఫ్, ఎంపీటీసీలు పలుగుల నవీన్ కుమార్, గిద్దె కర్ణాకర్, బోరెడ్డి వనజ ,టీఆరెస్ పార్టీ అధ్యక్షులు పిన్నపురెడ్డి నరేందర్ రెడ్డి ,సర్పంచులు పడాల వనిత శ్రీనివాస్, పోగుల ఆంజనేయులు, కల్లూరి ప్రభాకర్ రెడ్డి , వెన్నుకుఛీ రామ్మోహన్ శర్మ, గుడిపాటి వాణిశ్రీ, ఇమ్మడి మల్లప్ప , అమల బాలకృష్ణ, లలితశ్రీనివాస్ సురేష్ మాజీ ఎంపీపీ, బబ్బురి రవీందర్ నాథ్ గౌడ్, రాజయ్య,బద్దు నాయక్, పత్తిపాటి మంజుల, తదితరులు ,పాల్గొన్నారు.

Leave a Reply