గ్రామీణ క్రికెట్ క్రీడాకారులకు ఉచిత శిక్షణ శిబిరం

Share this:

గ్రామీణ క్రికెట్ క్రీడాకారులను నాణ్యమైన క్రికెటర్లుగా తీర్చిదిద్ది వారి అభివృద్ధికి వేదికను కల్పించే ఉద్దేశ్యంతో తెలంగాణ క్రికెట్ అసోషియషన్ ఆధ్వర్యంలో ఉచిత క్రికెట్ శిక్షణా శిబిరంను వేములవాడ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఈరోజు ప్రారంభించడం జరిగింది. మున్సిపల్ కౌన్సిలర్లు నిమ్మశెట్టి విజయ్, మారం కుమార్, గోలి మహేష్, అన్నారం శ్రీనివాస్ మరియు ముఖ్య అతిధి పట్టణ SI రామచంద్రం గౌడ్, సీనియర్ క్రికెట్ క్రీడాకారులు జక్కని శేఖర్, మర్రి రాజు,నిఖిల్, సరిల్,మహేష్, అథ్లెటిక్స్ కోచ్ సాయి నిర్వాహకులు మంద మనోహర్ మరియు క్రీడాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కౌన్సిలర్లు క్రీడాకారులకు 20,000 రూ. లను ఆట సామాగ్రి కోనుగోలుకు విరాళం అందించారు. ఆర్థిక సహాయం అందించిన కౌన్సిలర్లకు TCA జిల్లా కోచ్ మనోహర్ కృతజ్ఞతలు తెలియజేశారు. సీనియర్ క్రికెట్ క్రీడాకారుడు జక్కని శేఖర్ గారిని వేములవాడ క్రికెటర్ల తరుపున ఆత్మీయ సత్కారం చేయడం జరిగింది.

Leave a Reply