గ్రామ పంచాయతీలో నిరంతరంగా కొనసాగుతున్న..వ్యాక్సినేషన్ ప్రక్రియ

Share this:

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో కోవిడ్ వ్యాక్సినేషన్ శిబిరాన్ని సర్పంచ్ శ్రీపతిబాపు పరిశీలించారు.తెలంగాణ రాష్ట్రంలో ఒమిక్రాన్ వెరియంటేషన్ కోవిడ్ వైరస్ విజృంభన ప్రకంపనల నేపథ్యంలో ప్రజలు ఒక్కసారిగా భయాందోళనలకు లోనవుతున్నారని,కోవిడ్ టీకాలు తప్పనిసరిగా తీసుకోవాలనే ఆలోచన ప్రజల్లో బలంగా ఉందనడానికి,టీకా కేంద్రానికి వస్తున్న ప్రజలే నిదర్శనమని సర్పంచ్ శ్రీపతిబాపు అన్నారు..ప్రతి ఒక్కరూ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవడంతో పాటు, మాస్క్ లు తప్పనిసరిగా ధరించాల్సిందేనని,తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు మాస్క్ ధరించకపోతే..1000/-రూ.. జరిమానా విధింపు ఈ రోజు నుండి అమలులోకి వచ్చిందని,ప్రజలుగా ప్రతి ఒక్కరూ సహకరించాలని అన్నారు..వ్యాక్సిన్ తీసుకోకుంటే..రోడ్డుపైకి రావడానికి కూడా అనుమతి ఉండదని ప్రజలు గమనించాలని,18 సంవత్సరాల వయసు నిండిఉండి,వ్యాక్సిన్ తీసుకోకుండా ఇంకా ఎవరైనా మిగిలిఉంటే గ్రామ పంచాయతీలో టీకా తీసుకోవచ్చని అన్నారు..ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ వెన్నంపల్లి మహేష్,వార్డు సభ్యులు పోత రామకృష్ణ,పంచాయతీ పారిశుధ్య స్థాయి సంఘం కన్వీనర్ లింగాల రామయ్య,సీనియర్ నాయకులు కారెంగుల బాపురావు,దబ్బేట రవీందర్,ప్యాక్స్ డైరెక్టర్ ఇబ్రహీం ఖాన్,మందరగిరి వెంకటేశ్వర స్వామి దేవస్థాన డైరెక్టర్ ఢీకొండ మల్లేష్,హెల్త్ ఆర్గనైజర్ స్వామి,సీనియర్ హెల్త్ అసిస్టెంట్ రాజా రమణయ్య,ఏ ఎన్ ఎం హేమలత,ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు..

Leave a Reply